• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP GOVERNMENT SHIFTED COMMAND CONTROL ROOM VIJAYAWADA TO VISHAKAPATNAM NGS

Andhra Pradesh: పరిపాలన రాజధాని దిశగా మరో అడుగు! విశాఖకు కమాండ్ కంట్రోల్ రూమ్

Andhra Pradesh: పరిపాలన రాజధాని దిశగా మరో అడుగు! విశాఖకు కమాండ్ కంట్రోల్ రూమ్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. విశాఖలో ఉన్న ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

  • Share this:
    గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలకు ముందు రాష్ట్ర  ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఆ దిశాగా చాలా ప్రయత్నాలు చేసింది కూడా. అయితే కోర్టులో కేసుల కారణంగా.. మూడు రాజధానులు ఏర్పాటు ఆలస్యం అవుతూ వస్తోంది.

    సీఎం జగన్ మాత్రం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా విశాఖకు రాజధాని తరలించే ఆలోచనలోనే ఉన్నారు. మంత్రులు సైతం పదే పదే దీనిపై ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. త్వలోనే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది అని చెబుతూ వచ్చారు. విశాఖ నగరానికి సమాంతరంగా మరో సిటీ రూపుదిద్దుకుంటుందని, అందులో ఐకానిక్ బ్రిడ్జి కూడా ఉంటుందని మంత్రులు ప్రకటించారు. దీంతో ఏ క్షణమైనా రాజధాని మార్పుపై అధికారంగా ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని తరలింపుతో పాటు ఇతర చర్యలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల మంత్రి అవంతి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే విశాఖకు రాజధాని రానుందన్నారు. విశాఖ కేంద్రంగా త్వరలో పాలన ప్రారంభం కానుందన్నారు. తన నియోజకవర్గం భీమిలిలోని లక్ష్మీపురంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అలాగే అనకాపల్లి, గాజువాక నుంచి ఇటు తగరపువలస, భోగాపురం వరకూ మెట్రో రైలు ప్రాజెక్టు రాబోతోందని అప్పుడు అవంతి చెప్పారు. అలాగే భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి, ఎస్ కోట, డెంకాడ, భోగాపురం మండలాలతో విశాఖకు సమాంతరంగా మరో నగరం రూపుదిద్దుకోనుందని అవంతి వెల్లడించారు. మరో మంత్రి శంకర్ నారాయణ కూడా.. విజయనగరం జిల్లాలో భోగాపురంలో నిర్మించబోయే కొత్త ఎయిరోపోర్టును విశాఖతో అనుసంధానించేందుకు 1700 కోట్ల రూపాయలతో బీచ్ కారిడార్ నిర్మిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా భీమిలి భోగాపురం మద్య ఐకానిక్ బ్రిడ్జి కూడా వస్తుందన్నారు.

    తాజాగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏంటంటే. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. విశాఖలో ఉన్న ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్‍కు కేటాయించిన రూ.13.80 కోట్లు విశాఖలో ఏర్పాటు చేసే కంట్రోల్‍ రూమ్‍కు బదలాయింపు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి పరిపాలన రాజధాని దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందంటూ ప్రచారం జరుగుతోంది.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు