మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు షాక్... గన్‌మెన్‌లను తొలగించిన జగన్ సర్కార్

గతంలో ఎక్సైజ్ శాఖలో పని చేసిన తాను, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నందున ప్రాణహాని ఉందని, భద్రత కొనసాగించాలని జవహర్ కోరినట్టు సమాచారం.

news18-telugu
Updated: June 16, 2019, 8:40 AM IST
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు షాక్... గన్‌మెన్‌లను తొలగించిన జగన్ సర్కార్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు భద్రతను తగ్గించిన ఏపీ ప్రభుత్వం... తాజాగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా షాకిచ్చింది. వారి గన్ మెన్‌లను తగ్గించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గతరాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మంత్రులకు షిప్టుకు ఇద్దరేసి చొప్పున నలుగురు గన్ మెన్లతో సెక్యూరిటీ ఉండేది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఇలాగే సెక్యూరిటీ కొనసాగింది. శనివారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో గన్ మెన్లను రిపోర్ట్ చేయాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రాతపూర్వక నిర్ణయం లేకుండా, నోటి మాట ద్వారా సెక్యూరిటీ ఉపసంహరణ ఉత్తర్వులు శుక్రవారమే వెలువడ్డాయని సమాచారం.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రులు పితాని, జవహర్ లకు ఉన్న భద్రతను పూర్తిగా తొలగించినట్టు తెలుస్తోంది. గతంలో ఎక్సైజ్ శాఖలో పని చేసిన తాను, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నందున ప్రాణహాని ఉందని, భద్రత కొనసాగించాలని జవహర్ కోరినట్టు సమాచారం. ఆయన వినతిని పోలీసు అధికారులు పట్టించుకోలేదని సమచారాం. మరోవైపు కొందరు నేతలు ఓట్ల లెక్కింపు పూర్తికాగానే తమ గన్ మెన్ లను ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వ భద్రత తమకు అక్కర్లేదని మాగంటి బాబు, బడేటి బుజ్జిలు రెండు వారాల క్రితమే గన్ మెన్ లను తిప్పి పంపారు. ఎవరైనా తమకు భద్రత అవసరమని భావిస్తే, దరఖాస్తు చేసుకోవాలని, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

తాజాగా జగన్ సర్కార్ చంద్రబాబుకు కేటాయించిన జడ్ ప్లస్ సెక్యూరిటీలో కూడా కుదింపులు చేసింది. బాబు కాన్వాయ్‌లో రెండు వాహనాల్ని తగ్గించింది. తాజాగా చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం భద్రతాసిబ్బంది సాధారణ వ్యక్తిలా ట్రీట్ చేస్తూ తనిఖీలు చేశారు. దీనిపై టీడీపీ వర్గాలు, అభిమానులు భగ్గుమన్నారు. తమ అధినేతకు ఘోర అవమానం జరిగిందని మండిపడ్డారు. దీనిపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ స్పందించింది. గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు తనిఖీలు జరపడం తప్పేమీ కాదని స్పష్టం చేసింది.
First published: June 16, 2019, 8:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading