పోలవరం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ.. అందులో ఏముందంటే..

Polavaram Project Re tendering | పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. పోలవరం ప్రాజెక్ట్కు రూ.4,900 కోట్లతో రివర్స్ టెండరింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది.

news18-telugu
Updated: August 17, 2019, 5:30 PM IST
పోలవరం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ.. అందులో ఏముందంటే..
జగన్ మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టులో పనులు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. పోలవరం ప్రాజెక్ట్కు రూ.4,900 కోట్లతో రివర్స్ టెండరింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో రూ.3,600 కోట్ల అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్ కు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలవరం ప్రాజెక్ట్ లో హెడ్స్ వర్క్ మిగిలిన పనులకు రూ.1,800 కోట్లకు, హైడెల్ ప్రాజక్ట్ రూ.3,100 కోట్లకు కలిపి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాథమికంగా బెంచ్ మార్క్ కింద రూ.4900 కోట్ల విలువైన పనులకు రివర్స్ టెండరింగ్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. 2014లో ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ దక్కించుకున్న కాంట్రాక్ట్‌ కంటే 14 శాతం తక్కువ ధరను నిర్ణయించింది.

పోలవరం ప్రాజెక్టును ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ దక్కించుకున్నా..  ఆ సంస్థ అనుకున్నంత వేగంగా పనులు చేయడం లేదన్న కారణంతో గత టీడీపీ ప్రభుత్వం నవయుగ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో ప్రాజెక్టులను అధిక ధరలకు కట్టబెట్టారంటూ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను నవయుగ సంస్థకు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీలైనంత త్వరగా వచ్చి ప్రభుత్వంతో సెటిల్ చేసుకోవాలంటూ లేఖ రాసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలువచ్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం రివర్స్ టెండరింగ్ ఆలోచనను విరమించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా అవుతుంది కాబట్టి, తాము ముందుకు అడుగు వేస్తామని ప్రభుత్వం చర్య స్పష్టం చేస్తోంది.

First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు