అర్చకులకు గుడ్ న్యూస్.. మరో హామీని నిలబెట్టుకున్న జగన్

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ హామీని అమల్లోకి తెచ్చారు సీఎం జగన్. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ఏపీలోని అర్చకులు హర్షం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: October 21, 2019, 9:49 PM IST
అర్చకులకు గుడ్ న్యూస్.. మరో హామీని నిలబెట్టుకున్న జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)
news18-telugu
Updated: October 21, 2019, 9:49 PM IST
ఏపీలో పాలనను గాడిలో పెట్టారు సీఎం వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంతో పాటు మెనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నారు. ఇటీవలే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక చేయూత, వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన జగన్.. తాజాగా అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ హామీని అమల్లోకి తెచ్చారు సీఎం జగన్. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ఏపీలోని అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్చకులకు వంశపారపర్య చట్టాన్ని తీసుకొచ్చారు. 2009 నుంచి ఆ చట్టాన్ని ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదు. తాజాగా ఏపీ సీఎం జగన్ అర్చకులకు వంశపారపర్య హక్కులను కల్పిస్తూ జీవో విడుదల చేశారు.First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...