ఏపీ రాజధానిపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

రాజధానికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను సీఎం జగన్ సర్కార్ పునర్ సమీక్షిస్తోంది. ఈ క్రమంలోనే రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల అద్దె ఒప్పందాలపై సమీక్షించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

news18-telugu
Updated: December 16, 2019, 2:43 PM IST
ఏపీ రాజధానిపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
ఈ క్రమంలోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఆర్డీయేను రద్దు చేసి.. ఆ స్థానంలోనే అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
  • Share this:
ఏపీ రాజధానిగా అమరావతిని మార్చే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని కొద్దిరోజుల క్రితమే స్పష్టం చేసింది వైసీపీ ప్రభుత్వం. అయితే రాజధానికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను సీఎం జగన్ సర్కార్ పునర్ సమీక్షిస్తోంది. ఈ క్రమంలోనే రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల అద్దె ఒప్పందాలపై సమీక్షించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్ ధరల కంటే ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దెలపై అధికారుల సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు భవనాల్లో అద్దెకు ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల జాబితా పరిశీలన మొదలైంది. 2016 మార్చి 1 నుంచి ప్రైవేటు భవనాల అద్దె వివరాలను సాధారణ పరిపాలన విభాగం సేకరిస్తోంది. 2016లో చదరపు అడుగు కార్యాలయ స్థలం అద్దె రూ. 20గా గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రత్యేకమైన కేసులోనే చదరపు అడుగు అద్దె రూ. 30గా చెల్లించేలా నిర్ణయించింది. అయితే మార్కెట్ ధరల కంటే ఎక్కువ అద్దె వసూలు చేస్తున్న భవనాల విషయంలో తగిన చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ శాఖలు, హెచ్‌వోడీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్థికశాఖ, రహదారులు భవనాల శాఖ నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ అద్దె చెల్లింపులు లేకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ గుంటూరు పరిధి అద్దె భవనాల్లో విభాగాధిపతులు, ప్రభుత్వ శాఖకు, పీఎస్‌యూలకు ప్రభుత్వం నుంచి ఈ మేరకు సమాచారం అందింది. తక్షణమే ఉత్తర్వులు అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
Published by: Kishore Akkaladevi
First published: December 16, 2019, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading