లోకేశ్‌పై విచారణ... వైసీపీ నేత సంకేతాలు

మాజీమంత్రి లోకేశ్‌ గతంలో తీసుకున్న ఓ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం విచారణ చేపడుతోందనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: December 2, 2019, 1:04 PM IST
లోకేశ్‌పై విచారణ... వైసీపీ నేత సంకేతాలు
నారా లోకేష్ (File)
  • Share this:
టీడీపీ యువనేత, మాజీమంత్రి లోకేశ్‌ గతంలో తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం అంతర్గతంగా విచారణ చేపట్టిందా ? తమపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించలేకపోయారన్న చంద్రబాబు, లోకేశ్‌లకు షాక్ ఇచ్చేందుకు జగన్ సర్కార్ నిర్ణయించుందా ? ఈ ప్రశ్నలకు వైసీపీ ముఖ్యనేత చేసిన ట్వీట్‌ను బట్టి చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. లోకేశ్ ఐటీ మంత్రిగా ఉండగా మహిళల భద్రత కోసం కేంద్రం ఇచ్చిన 58 కోట్లను సింగపూర్‌కు మళ్లించాడని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం యాప్‌ తయారీకి ఖర్చు చేశారని విమర్శించారు.

58 కోట్ల స్కామ్‌పై విచారణ జరుగుతోందని లోకేశ్‌కు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు మంత్రిగా ఉన్న సమయంలో లోకేశ్ తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందా ? అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, తద్వారా చోటు చేసుకున్న అవినీతిని వెలికి తీసేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. ఇటీవల ఈ కేబినెట్ సబ్ కమిటీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో... విజయసాయిరెడ్డి ఈ ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>