అమరావతిలోనే ఏపీ రాజధాని... కానీ...

రాజధానిని అమరావతి నుంచి తరలించడం లేదనే విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా... నూతర నిర్మాణాల విషయంలో ఏ రకంగా ముందుకు సాగుతుందనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

news18-telugu
Updated: December 13, 2019, 5:35 PM IST
అమరావతిలోనే ఏపీ రాజధాని... కానీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ రాజధాని అమరావతి విషయంలో కొనసాగుతున్న డైలమాకు తెరపడింది. రాజధాని అమరావతిలో ఉంటుందో లేదో చెప్పలేమని ఈ సంగ్దిగ్దతకు తెరలేపారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. తాజాగా ఆయనే స్వయంగా అమరావతి నుంచి రాజధానిని తరలించడం లేదని లిఖితపూర్వకంగా మండలిలో సమాధానం ఇచ్చారు. టీడీపీ సభ్యురాలు శమంతకమణి అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడం లేదని వివరించారు. దీంతో ఏపీ రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందనే విషయంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

రాజధానిని అమరావతి నుంచి తరలించడం లేదనే విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా... నూతర నిర్మాణాల విషయంలో ఏ రకంగా ముందుకు సాగుతుందనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం...రాజధాని నిర్మాణాల విషయంలోనూ గత ప్రభుత్వం కంటే భిన్నమైన మార్గంలో వెళ్లాలని భావిస్తోంది. రాజధాని నిర్మాణం విషయంలో హంగు ఆర్భాటం కాకుండా... వాస్తవికంగా ముందుకు సాగాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అసలు అమరావతి నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ప్లాన్ ప్రకటిస్తుందన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.


First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>