• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP GOVERNMENT CHANGING COLOURS TO GOVERNMENT OFFICES DUE TO HIGH COURT ORDER BS

ఏపీలో పంచాయతీ ఆఫీసులకు కొత్త రంగులు.. తెరపైకి మరో వివాదం..

ఏపీలో పంచాయతీ ఆఫీసులకు కొత్త రంగులు.. తెరపైకి మరో వివాదం..

ప్రతీకాత్మక చిత్రం (Photo : Facebook)

మూడు వారాల్లోగా, స్థానిక ఎన్నికలకు ముందే ఏపీలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలన్న హైకోర్టు ఆదేశంతో జగన్ ప్రభుత్వం కొత్త రంగులు వేస్తోంది. ఇది వరకు వాడిన ఆకుపచ్చ, తెల్ల, నీలం రంగులతో పాటు కొత్తగా కాషాయ రంగులతో పెయింట్స్ వేయిస్తోంది.

  • Share this:
    మూడు వారాల్లోగా, స్థానిక ఎన్నికలకు ముందే ఏపీలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలన్న హైకోర్టు ఆదేశంతో జగన్ ప్రభుత్వం కొత్త రంగులు వేస్తోంది. ఇది వరకు వాడిన ఆకుపచ్చ, తెల్ల, నీలం రంగులతో పాటు కొత్తగా కాషాయ రంగులతో పెయింట్స్ వేయిస్తోంది. అయితే, మళ్లీ వైసీపీ పార్టీ జెండా కలర్ వచ్చేలా జగన్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. వివరాల్లోకెళితే.. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం హనుమాన్‌పాలెంలో ఓ పంచాయతీ ఆఫీస్‌కు కొత్తగా రంగులు వేశారు. రంగులు వేసిన ఆఫీస్‌ను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.

    మళ్లీ పాత రంగులను కలుపుతూ కొత్త రంగులు జోడించారని, హైకోర్టు చెప్పిందని రంగులు మార్చుతున్నారు తప్ప పెద్దగా ఉపయోగం లేదని ఆయన ఆరోపించారు. పంచాయతీ ఆఫీస్‌ను రైతు భరోసా కేంద్రంగా మార్చి.. పార్టీ రంగులు వచ్చేలా ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగులను అలాగే ఉంచారని అన్నారు. అదనంగా కాషాయ రంగును మాత్రమే జోడించారని చెప్పారు. ఇంత దానికి మళ్లీ రంగులు ఎందుకని, డబ్బులు వృథా తప్ప అని మాజీ మంత్రి ఆరోపించారు.

    తెలుపు రంగు-క్షీర విప్లవం, నీలం రంగు - చేపల పెంపకం, ఆకుపచ్చ రంగు - వ్యవసాయానికి ప్రతీక అంటూ చెప్పారని, కానీ వైసీపీ రంగులను ప్రతిబింబించేలా ఆ రంగులు ఉన్నాయని, అదనంగా కాషాయ రంగును వేశారని ఆయన అన్నారు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published: