Home /News /politics /

AP GOVERNMENT ADVISOR MADE SENSATIONAL ALLEGATIONS ON CHANDRA BABU TDP JANASENA BJP CPI FULL DETAILS HERE PRN

Sajjala Comments: టీడీపీ=బీజేపీ=కాంగ్రెస్‌=సీపీఐ=జనసేన.. గరుడ పురాణం ఎక్కడ..? సజ్జల సంచలన కామెంట్స్..

చంద్రబాబుపై సజ్జల ఫైర్

చంద్రబాబుపై సజ్జల ఫైర్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బీజేపీ (BJP) ఆధ్వర్యంలో జరిగిన జనాగ్రహ సభ రాష్ట్ర రాజకీయాల్లో వేడిపుట్టించింది. సభలో బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై అధికార వైసీపీ (YSRCP) గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బీజేపీ (BJP) ఆధ్వర్యంలో జరిగిన జనాగ్రహ సభ రాష్ట్ర రాజకీయాల్లో వేడిపుట్టించింది. సభలో బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై అధికార వైసీపీ (YSRCP) గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఏపీ బీజేపీ తీరు చూస్తంటే ప్రతిపక్ష టీడీపీకి అనుంబంధ సంఘంగా పనిచేస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ప్రజల్లో లేరని.., ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయో కూడా తెలియదని.., ఇప్పటివరకు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు పెట్టి మాట్లాడేవారు.. ఇప్పుడు ఇప్పుడు సభలు పెట్టాలనుకోవడం వాళ్ల సొంత ఆలోచన కాదని.. ఇది ముమ్మాటికీ చంద్రబాబు ఆలోచననేని ఆయన ఆరోపించారు. వీళ్ళ అందరి టార్గెట్‌ ఒకటేనని.., ఎరుపులో ఒక పార్టీ సీపీఐ నుంచి.. కాషాయ పార్టీ వరకూ అంతా ఒకటే తానుఅని సజ్జల విమర్శించారు. టీడీపీ=బీజేపీ=కాంగ్రెస్‌=సీపీఐ=జనసేన అని ఆయన అభివర్ణించారు.

  అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో, న్యాయస్థానం నుంచి దేవస్థానం అని 400మందితో పాదయాత్ర పేరుతో వందకోట్లు వసూలు చేసి తిరుపతి చేరుకుని అక్కడ సభలో వీరిందరు కలిసినప్పుడు ఫర్‌ఫెక్ట్‌ పిక్చర్స్‌ వచ్చిందన్నారు. "జగన్‌ మోహన్‌ రెడ్డిగారిది రాక్షస పాలన. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు" అని వరుసపెట్టి స్లోగన్స్‌ ఇచ్చిన వారు అందులో నిజమెంతో ఆధారాలతో సహా నిరూపించాలని సజ్జల సవాల్ విరిసారు.

  ఇది చదవండి: సినిమా టికెట్లపై రోజా కీలక వ్యాఖ్యలు.., వాళ్లు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్న ఫైర్ బ్రాండ్


  ఇక బీజేపీ నేత సునీల్‌ థియోదర్‌ ట్వీట్స్‌ అన్నీ పచ్చి అబద్ధపు కూతలేనని సజ్జల అన్నారు. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా మత మార్పిడులే అని బీజేపీ అంటే.. రెండోరోజు జనసేన ఎత్తుకుంటుంది. మధ్యాహ్నానికి ఇదే విషయాన్ని సీపీఐ రామకృష్ణ మొదలుపెడతారు. ఒకోరోజు పాత్ర మారొచ్చు. ఈ మూడు పార్టీలూ ఒక తానులో ముక్కలుగా తయారయ్యాయన్నారు. గతంలో చలసాని శ్రీనివాస్‌, గరుడ పురాణం శివాజీ మాదిరిగా. .ఒక్కొక్కరుగా ఉంటే ఇప్పుడు పార్టీలు ఆ పాత్రను పోషిస్తున్నాయని ఆరోపించారు. అప్పట్లో వ్యక్తులను తయారు చేసిన చంద్రబాబు ఇప్పుడు పార్టీలను విజయవంతంగా తన ఫింగర్‌ టిప్స్‌మీద తోలుబొమ్మలాట ఆడిస్తున్నారని.., ఆయన ఏది అనుకుంటే అదే స్టేట్‌మెంట్‌ అని మండిపడ్డారు.

  ఇది చదవండి: ఏపీలో బీజేపీ వ్యూహం అదేనా..? కమలనాథులు టార్గెట్ రీచ్ అవుతారా..?


  ఇంత పెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ, జాతీయ స్థాయిలో కాకుండా, ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీకి అనుగుణంగా పనిచేయడం బహుశా దేశంలోనే తొలిసారేమోనని సజ్జల అన్నారు. చంద్రబాబు అనే దుష్టశక్తి ఎత్తుగడలు, మ్యానిప్లేషన్స్‌ లో భాగంగా, తన గేమ్‌లో ప్రతి ఒక్కరినీ పావులాగా వాడుకోగలిగిన, రాజకీయాల్లో మాయల పకీరు లాంటి బాబు ఎజెండాను పట్టుకుని సభ పెట్టడం చూస్తే జాలి కలిగిస్తోందన్నారు.

  ఇది చదవండి: వైసీపీ ఎంపీ హత్యకు కుట్ర..? సొంతపార్టీ నేతలే స్కెచ్ వేశారా..? బాంబు పేల్చిన మరో ఎంపీ..!


  మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించారన్న అంశంపై డీజీపీకి చంద్రబాబు రాసిన లేఖను చూస్తే నవ్వు వస్తోందని సజ్జల అన్నారు. వంగవీటి రాధాకు భద్రత కల్పిస్తామని ప్రభుత్వమే చెప్పిందని.. దానిని పట్టించుకోకుండా గూండారాజ్‌, హింసారాజ్‌ అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చాంతాడంత లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు, తానే తుమ్ముకుని, తానే శ్రీరామ అనుకునే బాపతు అని సజ్జల ఎద్దేవా చేశారు. రాధా మాటలను పట్టుకుని, రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిందని చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Sajjala ramakrishna reddy, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు