Home /News /politics /

పోలవరంపై పులివెందుల పంచాయతీ... మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

పోలవరంపై పులివెందుల పంచాయతీ... మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టు

పోలవరం ప్రాజెక్టు

రూ.3220 కోట్ల జల విద్యుత్ టెండర్లను కూడా నవయుగ దక్కించుకుంది. అయితే జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని నవయుగకు తాజాగా ఇరిగేషన్ శాఖ సూచించింది.

  పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని తప్పు పట్టారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. పోలవరంపై పులివెందల పంచాయాతీ మొదలుపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం జగన్, వైసీపీ నేతలపై మండిపడ్డారు.పోలవరం పనులు దాదాపు పూర్తయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. అయితే... పోలవరం పనుల్లో అవినీతి జరిగిందంటూ కావాలనే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం డ్యామ్ దగ్గర గోదావరి వరదను మళ్లించేందుకు నవయుగ ఇంజినీర్లు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని తెలిపారు.

  60సీ నిబంధన ప్రకారం 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించారు. రూ.3వేల కోట్ల విలువైన పనుల్ని నవయుగకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3220 కోట్ల జల విద్యుత్ టెండర్లను కూడా నవయుగ దక్కించుకుంది. అయితే జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని నవయుగకు తాజాగా ఇరిగేషన్ శాఖ సూచించింది. కాగా... పోలవరం పనులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పోలవరం టెండర్లు, పనుల అప్పగింత, అంచనాల పెంపుతో అవినీతి జరిగిందని నివేదికలో పేర్కొంది. దీంతో నవయుగను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా స్పందించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం పులివెందుల పంచాయతీ మొదలు పెట్టిందటూ విమర్శలు గుప్పించారు.
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Devineni uma, Polavaram

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు