బీజేపీలోకి మాజీ సీఎం... ఆయన తమ్ముడు కూడా...

కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తామని... కిషోర్ కుమార్ రెడ్డికి రాష్ట్రస్థాయిలో మంచి బాధ్యతలు ఇస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే హామీ ఇచ్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: July 23, 2019, 12:10 PM IST
బీజేపీలోకి మాజీ సీఎం... ఆయన తమ్ముడు కూడా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో బీజేపీలోకి వలసలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. పేరున్న నాయకులందరినీ తమ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్న బీజేపీ... ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్... ఇప్పటికే ఇందుకు సంబంధించిన సంకేతాలు కూడా ఇచ్చారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం కిరణ్... ప్రచారంలో మాత్రం పెద్దగా కనిపించలేదు.

తన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండటం వల్లే మాజీ సీఎం కిరణ్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారనే వాదనలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరితే ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏమిటనే దానిపై కూడా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మాజీ సీఎం కిరణ్‌తో పాటు ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తామని... కిషోర్ కుమార్ రెడ్డికి రాష్ట్రస్థాయిలో మంచి బాధ్యతలు ఇస్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే హామీ ఇచ్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలకు ముందు పార్టీల పరంగా విడిపోయిన మాజీ సీఎం కిరణ్, ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిలను రాజకీయంగా మళ్లీ ఒక్కటి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: July 23, 2019, 12:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading