వాటికి ఎన్నికల కోడ్ వర్తించదు : సీఎస్‌ సుబ్రహ్మణ్యంపై ఫైర్ అయిన మంత్రి యనమల

అన్నదాత సుఖీభవకు రూ.5వేల కోట్లు, పసుపు-కుంకుమకు రూ.4వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్టు యనమల తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే రైతులు, మహిళలకు చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు.

news18-telugu
Updated: April 24, 2019, 1:43 PM IST
వాటికి ఎన్నికల కోడ్ వర్తించదు : సీఎస్‌ సుబ్రహ్మణ్యంపై ఫైర్ అయిన మంత్రి యనమల
యనమల రామకృష్ణుడు, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి(File)
news18-telugu
Updated: April 24, 2019, 1:43 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్, సీఎంల మధ్య వివాదం ముదురుతూనే ఉంది. సీఎస్‌గా పునేఠ స్థానంలో సుబ్రహ్మణ్యం వచ్చినప్పటి నుంచి సీఎంతో ఆయనకు పొసగడం లేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సీఎం నిర్వహించే సమీక్షలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సీఎం సమీక్షలకు హాజరైన అధికారులపై కూడా ఆయన మండిపడుతుండటంతో.. సమీక్షా సమావేశాలకు వెళ్లేందుకు వారు జంకుతున్నారు. అంతేకాదు, ప్రభుత్వ పరిపాలన అధికారి హోదాలో సీఎస్ ఇప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

సీఎస్ నిర్వహిస్తున్న సమీక్షలపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నవేళ.. సీఈవో(ఎన్నికల ప్రధాన అధికారి) నిర్వహించాల్సిన సమీక్షలను సీఎస్ నిర్వహించడమేంటని ప్రశ్నిస్తోంది. తాజాగా ఇదే విషయంపై స్పందించిన యనమల రామకృష్ణుడు ప్రభుత్వ పథకాలకు నిధులపై సీఎస్ సమీక్షలు నిర్వహించడమేంటని మండిపడ్డారు. పసుపు-కుంకుమ, పెన్షన్లు, రైతులకు పెట్టుబడి వంటి పథకాలకు బడ్జెట్‌లోనే కేటాయింపులు చేశామని చెప్పారు.

అన్నదాత సుఖీభవకు రూ.5వేల కోట్లు, పసుపు-కుంకుమకు రూ.4వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్టు యనమల తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే రైతులు, మహిళలకు చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు. బడ్జెట్‌లో పేర్కొన్న పథకాలు ఎన్నికల కోడ్ కిందకు రావని కోర్టులు కూడా స్పష్టం చేశాయని గుర్తుచేశారు. సీఎస్ ఇప్పటికైనా సమీక్షలు మానుకోవాలని సూచించారు.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...