అమరావతి నిర్మాణంపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ ప్రభుత్వం కేవలం వందరోజుల పాలనే పూర్తి చేసుకుందన్నారు. అమరావతిలో ఆర్థిక నగరం అభివృద్ధికే సింగపూర్ సంస్థలు పరిమితమన్నారు బుగ్గన.

  • Share this:
    ఏపీ రాజధాని అమరావతిపై సీఎం జగన్ తప్పా.... ఆయన మంత్రులంతా మాట్లాడుతున్నారు. తాజాగా ఏపీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు లేవన్నారు బుగ్గన. రాష్ట్రంలో అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలనుకోవడం సరికాదన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారించినట్టు తెలిపారు. భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు ఏపీ తరపున హాజరైన ఆయన అక్కడ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఏపీ ప్రభుత్వం కేవలం వందరోజుల పాలనే పూర్తి చేసుకుందన్నారు.  అమరావతిలో ఆర్థిక నగరం అభివృద్ధికే సింగపూర్ సంస్థలు పరిమితమన్నారు బుగ్గన. అమరావతిని తాము విస్మరించలేదన్న మంత్రి, దీని నిర్ణయానికి మరికొన్ని నెలల సమయం పడుతుందన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించడంపై దృష్టి సారించామన్నారు. అందరికీ సుస్థిర జీవనం, ఉత్పాదక రంగాన్ని అన్నిచోట్లా అభివృద్ధి చేయడం, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి వాటి కల్పనే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వ్యవసాయాధారిత రాష్ట్రంలో పరిశ్రమలు పెంచుకోవడంపై దృష్టి సారించామన్నారు.

    సింగపూర్ విదేశాంగమంత్రి వివియన్ బాలకృష్ణన్ సదస్సులో మాట్లాడుతూ.. ఏపీలో కొత్త ప్రభుత్వం వంద రోజుల పాలనను మాత్రమే పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వం తమ ప్రాధామ్యాలను మార్చుకుంటున్నప్పుడు కాంట్రాక్టర్లు కూడా ఆయా ప్రాజెక్టుల్లో కొనసాగాలా? వద్దా? అనేది వాళ్లే నిర్ణయించుకుంటారన్నారు. రాజధానిపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని సదస్సుకు హాజరైన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
    First published: