ఏపీ అసెంబ్లీ ప్రారంభం... అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

చట్టసభలకు రాజధాని అమరావతి అంటూ బుగ్గన ఈ సందర్భంగా తెలిపారు. పరిపాలన బాధ్యతలు అన్ని కూడా విశాఖలోనే నిర్వహిస్తామన్నారు.

news18-telugu
Updated: January 20, 2020, 11:51 AM IST
ఏపీ అసెంబ్లీ ప్రారంభం... అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన
ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
  • Share this:
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ప్రవేశ పెట్టారు. దీంతో పాటు సీఆర్డీఏను రద్దు చేస్తూ కూడా సభలో బిల్లు ప్రవూశ పెట్టారు.  రాష్ట్రంలో ప్రత్యేకమైన జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు బుగ్గన. అభివృద్ధి అనేది వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. చట్టసభలకు రాజధాని అమరావతి అంటూ బుగ్గన ఈ సందర్భంగా తెలిపారు.

విశాఖలోనే రాజ్ భవన్, సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు. పరిపాలన బాధ్యతలు అన్ని కూడా విశాఖలోనే నిర్వహిస్తామన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను నిర్ణయించామన్నారు. ఇక జ్యుడీషియల్ బాధ్యతలు అన్ని కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ ఏరియా ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నామన్నారు. కర్నూలులో న్యాయపరమైన అన్నిశాఖలు ఏర్పాటు చేస్తామన్నారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి బుగ్గన. ప్రాంతీయ అసమానతలు, సమాన అభివృద్ధి లేకపోవడం వల్లే రాష్ట్రంలో అశాంతికి దారితీస్తున్నాయన్నారు.

రాష్ట్ర జనాభాలో వివిధ వర్గాల మధ్య సమాన అభివృద్ధి లేదన్న అభిప్రాయం ఉందన్నారు బుగ్గన.ప్రజలకు కావాల్సింది అభివృద్ధి భద్రత అన్నారు.  ప్రజలెవరూ రాజభవనాలు కోరుకోరన్నారు. ఆంధ్రా అనే పదమే పాత పదమన్నారు. ఆంధ్రా తర్వాతే తెలుగు అనేపదం వచ్చిందన్నారు మంత్రి. తెలుగు భాష వలనే మనమంతా కలిసి ఉన్నామన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు కూడా తెలుగు ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. ఏ పరిపాలన అయినా పన్నుల బట్టి, ఆదాయాన్ని బట్టి ఉంటుందన్నారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు