బాలయ్య, లోకేష్, శ్రీభరత్.. మామా అల్లుళ్లు ముగ్గురికీ ఆ ఒక్కటే టెన్షన్..

నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, శ్రీభరత్.. మామా అల్లుళ్లు ముగ్గురూ గెలుస్తారా? లేదా? అనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది.

news18-telugu
Updated: May 19, 2019, 3:19 PM IST
బాలయ్య, లోకేష్, శ్రీభరత్.. మామా అల్లుళ్లు ముగ్గురికీ ఆ ఒక్కటే టెన్షన్..
బాలకృష్ణ, నారా లోకేశ్, శ్రీభరత్
news18-telugu
Updated: May 19, 2019, 3:19 PM IST
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ అయిన నియోజకవర్గాల్లో కచ్చితంగా హిందూపురం, మంగళగిరితో పాటు విశాఖపట్నం లోక్‌సభ సీటు కూడా ఉన్నాయి. నందమూరి బాలయ్య, ఆయన ఇద్దరు అల్లుళ్లు పోటీలో ఉండడంతో నందమూరి అభిమానులు, టీడీపీ ఫ్యాన్స్‌తో పాటు అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో కూడా బాలయ్యపై కొందరు సందేహాలు లేవనెత్తుతున్నారు. 2014లో బాలయ్య ఇక్కడి నుంచి గెలిచారు. అయితే, హిందూపురంలో సమస్యలను పట్టించుకోవడలో బాలయ్య విఫలం అయ్యారని, అక్కడ అంతా ఆయన పీఏల పాలన కొనసాగిందనే ఆరోపణలు చాలా ఉన్నాయి. బాలయ్యకు వ్యతిరేకంగా వైసీపీ, వామపక్షాలు ధర్నాలు కూడా చేశాయి. ఈ క్రమంలో బాలయ్య అక్కడ మళ్లీ గెలుస్తారా? లేదా అనే ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

ఇక నారా లోకేష్ మంగళగిరిలో పోటీ మీద రాష్ట్రవ్యాప్తంగా చర్చ ఉంది. టీడీపీ ఇప్పటి వరకు గెలవని సీటులో పోటీ చేయడం, రాజధాని ప్రాంతం కావడంతో అక్కడ లోకేష్ గెలుస్తారా? లేదా అనే దానిపై రాజకీయ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. లోకేష్‌ను ఓడించడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డింది. అక్కడ నారా లోకేష్ కచ్చితంగా గెలుస్తారని ఎవరూ చెప్పలేని పరిస్థితి. మరోవైపు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన బాలయ్య రెండో అల్లుడు శ్రీభరత్ గెలుపు మీద టీడీపీలోనే అంచనాలు లేవు. విశాఖలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, అక్కడ జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ వైపు మొగ్గుచూపారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తొలిసారి మామా అల్లుళ్లు ముగ్గురిలోనూ ఫలితాల మీద టెన్షన్ ఉంది.

First published: May 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...