ఎన్టీఆర్‌ను మాట్లాడనివ్వలేదు... అదే కరెక్ట్ అన్న టీడీపీ నేత

అసెంబ్లీ లాబీల్లో జరిపిన చిట్‌చాట్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చిన యనమల... ఎన్టీఆర్ సీఎంగా దిగిపోయే సమయంలో జరిగిన పరిణామాలు వేరని... బయట చేసే విమర్శలు వేరు అని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: December 10, 2019, 2:00 PM IST
ఎన్టీఆర్‌ను మాట్లాడనివ్వలేదు... అదే కరెక్ట్ అన్న టీడీపీ నేత
ఎన్టీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
గతంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదనే ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత, నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు స్పందించారు. అసెంబ్లీ లాబీల్లో జరిపిన చిట్‌చాట్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చిన యనమల... ఎన్టీఆర్ సీఎంగా దిగిపోయే సమయంలో జరిగిన పరిణామాలు వేరని... బయట చేసే విమర్శలు వేరు అని వ్యాఖ్యానించారు. ఆనాడు జరిగిన బీఏసీ సమావేశానికి తనను ఎందుకు పిలవలేదన్న అంశంపై సభలో మాట్లాడతానని నాడు ఎన్టీఆర్ కోరారు. అయితే అప్పటికే టీడీఎల్పీ నేతగా ఎమ్మెల్యేలు చంద్రబాబును ఎన్నుకున్నారని యనమల తెలిపారు.

నిబంధనల ప్రకారం ఫ్లోర్ లీడర్లను మాత్రమే బీఏసీకు పిలుస్తారని... తాను నిబంధనలను పాటించానని తెలిపారు. ఆ అంశంపై మాట్లాడొద్దని.. తాను చెప్పాలనుకున్న అంశాలను చెప్పొచ్చని ఎన్టీఆరుకు చెప్పానని అన్నారు. కానీ ఎన్టీఆర్ అ అంశం మీదే మాట్లాడతానని.. వేరే అంశాలపై మాట్లాడనంటూ వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. స్పీకర్ కుర్చీలో కూర్చొన్నప్పుడు నిబంధనలు ప్రకారమే వ్యవహరించాలని.. సెంటిమెంట్లకు తావివ్వకూడదని అన్నారు. ఎన్టీఆర్ ఎపిసోడ్‌పై స్పీకర్ తమ్మినేని కామెంట్లకు కౌంటర్‌గా యనమల రియాక్షన్ ఇచ్చారు.

AP Finance Minister Yanamala Krishnudu fires on Chief Secretary over review meetings
యనమల రామకృష్ణుడు, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి(File)


అంతకుముందు ఎన్టీఆర్‌ను గద్దె దింపిన పాపంలో నాకు భాగస్వామ్యం ఉందన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అప్పట్లో సభలో ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆ పాపం చేసిన దానికే తాను 16 ఏళ్ల పాటు అధికారానికి దూరమయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎవరి జాగీరు కాదన్నారు. శాసనసభ స్పీకర్ గా సభ్యులందరికీ అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తన పరిమితులు, అధికారాలు తనకు తెలుసన్నారు తమ్మినేని. స్పీకర్‌గా తనకున్న అధికారాలతోనే టీడీపీ ఎమ్మెల్యే వంశీకి మాట్లాడే అవకాశం కల్పించానన్నారు.సభ ప్రారంభం అవ్వగానే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడంపై ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందిస్తూ స్పీకర్ పై వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ, జనసేన, సీపీఐ పార్టీ ఏదైనా సరే ఏపార్టీకి చెందినవారైనా సరే మట్లాడే అవకాశం కల్పించాల్సిన అవసరం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు తమ్మినేని.
First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>