ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూత

కోడెల శివప్రసాద రావు (ఫేస్‌బుక్ ఫోటో)

Kodela Sivaprasad Rao death | ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు హఠాన్మరణం పాలయ్యారు.

  • Share this:
    ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. కొంతకాలంగా వరుస కేసులతో సతమతమవుతున్న కోడెల శివప్రసాదరావు... ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే ఆయన గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక గుండెపోటు కారణంగా మరణించారా అన్నది తేలాల్సి ఉంది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోడెలతో పాటు ఆయన కుటుంబసభ్యులపై వరుస కేసులు నమోదయ్యాయి. ఆయన కుమారుడు, కూతురుపై కూడా కేసులు నమోదయ్యాయి.

    ఏపీ ఫర్నీచర్‌ను తన కోడెల తన ఇంటికి తరలించుకోవడం కూడా వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన కోడెల కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిరోజులకే ఆయన హఠాత్తుగా కన్నుమూయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు వరుస కేసులు, మరోవైపు టీడీపీ అధినాయకత్వం అంతగా పట్టించుకోకపోవడం కూడా కోడెల మనస్థాపానికి కారణమైందనే ప్రచారం కూడా సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: