కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం... పరిస్థితి విషమం ?

కోడెల శివ ప్రసాద్(ఫైల్ ఫోటో)

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది.

  • Share this:
    ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొంతకాలంగా వరుస కేసులతో సతమతమవుతున్న కోడెల శివప్రసాదరావు... తీవ్ర మనస్థాపం కారణంగానే ఆ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా కేసులతో ఇబ్బందిపడుతున్న కోడెల... ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు... ఆయనకు శ్వాస అందడం లేదని చెప్పినట్టు తెలుస్తోంది.

    కొద్దిరోజుల క్రితం కోడెల గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కోడెల... మళ్లీ ఈ రకంగా ఆస్పత్రిలో చేరడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. కోడెలతో పాటు ఆయన కుమారుడు, కూతురుపై అనేక కేసులు నమోదు కావడం... ఆయన కుమారుడు కేసుల కారణంగా అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం.
    Published by:Kishore Akkaladevi
    First published: