మీసేవ రద్దుపై మండిపడ్డ నారా లోకేష్... సీఎంపై సంచలన వ్యాఖ్యలు

‘అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ధి బురదలోకి లాగుతుంది అంటూ సీఎంను ఎద్దేవా చేస్తూ నారా లోకేష్ ట్వాట్ చేశారు.

news18-telugu
Updated: August 10, 2019, 1:22 PM IST
మీసేవ రద్దుపై మండిపడ్డ నారా లోకేష్... సీఎంపై సంచలన వ్యాఖ్యలు
నారా లోకేష్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో ‘మీసేవా’ కేంద్రాలు రద్దు చేస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ధి బురదలోకి లాగుతుంది. గారిని చూస్తుంటే ఇది నిజం అని తేలిపోయింది. అందరికీ సమన్యాయం చేస్తా అంటే ఏంటో అనుకున్నాం’ అంటూ  సీఎంను  ఎద్దేవా చేస్తూ నారా లోకేష్ ట్వాట్ చేశారు. ‘మొన్న ఆశా కార్యకర్తలు, నిన్న గోపాల మిత్రలు, ఈరోజు జూడాలు ఇక మీరిప్పుడు మీసేవ కూడా రద్దు చేస్తే రేపు మీసేవ ఉద్యోగులన్న మాట. అందరినీ రోడ్ల పాలు చేస్తున్నారు. ఓటేసిన ఏ ఒక్కరినీ వదలడం లేదు. మీ ఉద్దేశ్యంలో మాట తప్పం అంటే ఇదేనా?’ అంటూ జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ పలు ప్రశ్నలు సంధించారు.

ఏపీలో మీసేవ కేంద్రాలు బంద్... త్వరలో ప్రభుత్వ కీలక నిర్ణయం ?, mee seva centre will be close in andhra pradesh
ప్రతీకాత్మక చిత్రం


ఏపీ సచివాలయం తరహాలో ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందాలన్న లక్ష్యంతో గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ ఈ సేవలను అందించిన మీ-సేవ కేంద్రాలు మూతపడే అవకాశముంది. దీనిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుంది.మీ సేవ సెంటర్ల వల్ల ప్రభుత్వ సేవలు నామమాత్రపు రుసుముతో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేకపోవడం, కాంట్రాక్టు తీసుకున్న వారు సిబ్బందికి జీతాలు చెల్లించే పరిస్ధితులు లేకపోవడంతో అవి నాసిరకంగా తయారయ్యాయి.

దీంతో మీ సేవ సెంటర్లకు వెళ్తున్న ప్రజలకు నిరాశ తప్పడం లేదు. దీన్ని గమనించిన ప్రభుత్వం.. మీ సేవకు అనుమతిచ్చిన సేవలను గ్రామ సచివాలయాలకు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ఏర్పాటు వల్ల ఆయా ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాలు తొలి దశలో మూతపడే అవకాశముంది. ఈ విధానం విజయవంతమైతే భవిష్యత్తులో పట్టణాలు, నగరాల్లో ఉన్న మీ సేవ కేంద్రాలకూ దీన్నే వర్తింపచేస్తారు.
First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>