5 లక్షలిస్తే ఉద్యోగం.. గ్రామ సచివాలయ ఫలితాలపై టీడీపీ ఆరోపణలు

లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెబుతూ.. 18 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: September 20, 2019, 4:20 PM IST
5 లక్షలిస్తే ఉద్యోగం.. గ్రామ సచివాలయ ఫలితాలపై టీడీపీ ఆరోపణలు
చంద్రబాబు, వైఎస్ జగన్
  • Share this:
ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాలపై దుమారం రేగుతోంది. ప్రశ్నాపత్రాలను లీక్ చేసి.. ఏపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఏం తమాషాలు చేస్తున్నారా? అని వైసీపీపై విరుచుకుపడ్డారు. రూ.5 లక్షలకు ఒక ఉద్యోగాన్ని అమ్ముకున్నారని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు లోకేష్. లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెబుతూ.. 18 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశ్నాపత్రాలను లీక్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల పేరిట భారీ స్కాం చేసారు. లక్షలాది నిరుద్యోగులను దగా చేశారు. వారి భవితకు ఉరేశారు. ఏంటి తమషాలా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మోసపోయిన నిరుద్యోగులకు ఏ రకంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
చంద్రబాబు, ఏపీ మాజీ సీఎం


ప్రభుత్వ ఉద్యోగం కోసం నిద్రాహారాలు మాని కష్టపడి చదివి పరీక్ష రాస్తే, మీ పెద్దలు గద్దల్లా పరీక్ష పేపరు ముందే ఎత్తుకుపోయారు. ఒక్కో ఉద్యోగాన్ని 5 లక్షలకు అమ్ముతున్నారనే వార్తలపై స్పందించలేదెందుకు? 1,26,728 మందికి ఉద్యోగాలిచ్చామని ప్రకటించుకున్న మీరు, పేపర్ లీకుతో 18 లక్షలకు పైగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ఆశలు అడియాశలైన నిరుద్యోగుల కన్నీళ్లకూ ఖరీదు కట్టి చెల్లిస్తారా?
లోకేష్
క్వశ్చన్ పేపర్‌ని ఏపీపీఎస్సీ తయారు చేసిందని.. ఆ టీమ్‌లో పనిచేసిన ఓ మహిళ గ్రామ సచివాలయ పరీక్ష రాసిందని ఆరోపణలున్నాయి. పరీక్షల్లో ఆమెనే టాపర్‌గా నిలిచందని పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆమె కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరు కూడా టాపర్లగా నిలిచారని విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ పరీక్షల్లో గూడూపుఠాణి నడించిందని, కొందరికి లబ్ధి చేకూరేలా ప్లాన్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టిపారేశారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని..ప్రశ్నాపత్రం బయటకు వచ్చే అవకాశమే లేదని స్పష్టంచేశారు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading