వైసీపీపై విమర్శలు వద్దన్న టీడీపీ నేత... ఏం జరిగిందంటే ?

అధికార వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి ఏ మాత్రం నచ్చడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: August 15, 2019, 4:45 PM IST
వైసీపీపై విమర్శలు వద్దన్న టీడీపీ నేత... ఏం జరిగిందంటే ?
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా పూర్తికాకముందే... ప్రభుత్వంపై రాజకీయ దాడి మొదలుపెట్టింది విపక్ష టీడీపీ. ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షం ఏ రేంజ్‌లో విరుచుకుపడుతుందో...దాదాపు అదే స్థాయిలో వైసీపీపై విమర్శలు చేస్తోంది. జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు తనయుడు, ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్ ఈ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రోజూ వైసీపీ ప్రభుత్వంపై తన ట్విట్లతో విరుచుకుపడుతున్నారు లోకేశ్.

అయితే టీడీపీ వైసీపీపై విమర్శలు చేయడం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి ఏ మాత్రం నచ్చడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన అయ్యన్నపాత్రుడు... సమావేశంలో తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పినట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి కనీసం మూడు నెలలు కూడా కాకముందే ఈ స్థాయిలో విమర్శలు చేయడం ఎందుకని ఆయన నేరుగా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్టు వార్తలు వినిపించాయి.

అధికార పార్టీ తప్పులు చేస్తే చేయనివ్వాలని... అప్పుడే రాజకీయంగా టీడీపీకి లాభం జరుగుతుందని అయ్యన్నపాత్రుడు కామెంట్ చేసినట్టు టాక్. ఇప్పుడే తీవ్రమైన రాజకీయ దాడి చేయాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇంత తొందరగా ప్రభుత్వంపై రాజకీయ దాడి చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...