• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • AP EX HOME MINISTER NIMMAKAYALA CHINARAJAPPA FIRES ON CM YS JAGAN MOHAN REDDY AK

ముందు వీటి గురించి ఆలోచించండి... ఏపీ ప్రభుత్వంపై చినరాజప్ప ఫైర్

ముందు వీటి గురించి ఆలోచించండి... ఏపీ ప్రభుత్వంపై చినరాజప్ప ఫైర్

చినరాజప్ప(File)

రాష్ట్రంలో కొత్తగా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సీఎం జగన్ ఎందుకు అడగడం లేదని చినరాజప్ప ప్రశ్నించారు.

 • Share this:
  ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రాజధాని అంశంపై మాట్లాడటం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా నియంత్రణపై సీఎం జగన్ దృష్టి సారించకుండా ఇతర అంశాలపై శ్రద్ధ చూపిస్తున్నారని ఆరోపించారు. కరోనా నియంత్రణకై ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు కనీస సదుపాయాలను ప్రభుత్వం కల్పించడం లేదని చినరాజప్ప విమర్శించారు. వైద్యులకు అవసరమైన మెడికల్ ఉపకరణాలు, కిట్లు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

  అనంతపురం, గుంటూరులో పలువురు వైద్యులకు కరోనా సోకడంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సీఎం జగన్ ఎందుకు అడగడం లేదని రాజప్ప ప్రశ్నించారు. అదేవిధంగా జనాభాకు తగ్గట్లుగా రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులకు తగిన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని చినరాజప్ప కోరారు.
  Published by:Kishore Akkaladevi
  First published: