Home /News /politics /

AP EX CS AND BJP LEADER IYR KRISHNA RAO COMMENTS ON LV SUBRAMANIAM TRANSFER AK

అందుకే ఈ బహుమానం... సీఎస్ బదిలీపై మాజీ సీఎస్ షాకింగ్ కామెంట్స్

ఎల్ వీ సుబ్రహ్మణ్యం

ఎల్ వీ సుబ్రహ్మణ్యం

ఏపీ సీఎస్ బదిలీపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఆంధ్రప్రదేశ్ సీఎస్(ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికప్పుడు సీఎస్‌ను బదిలీ చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. సీఎస్‌ను ఆయన కిందిస్థాయి అధికారి బదిలీ చేయడంపై కూడా వివాదాస్పదంగా మారుతోంది. అయితే ఏపీ సీఎస్ బదిలీపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి సీఎస్‌ను తప్పించే అధికారం ఉన్నప్పటికీ... ఈ తొలగించిన విధానం సరిగా లేదని ఆయన అన్నారు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.

    హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడినందుకు ఇది బహుమనం అయితే ఇంకా మరీ దారుణం అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసింది మాజీ సీఎస్ ఐవైఆర్ కావడంతో... ఆయన విమర్శలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన బీజేపీ నాయకుడు కావడం వల్లే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, AP CS LV Subramanyam, AP News, AP Politics, IYR Krishna Rao

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు