హోమ్ /వార్తలు /politics /

Chandrababu deeksha: చంద్రబాబు సంచలన నిర్ణయం.. 36 గంటల పాటు నిరసన దీక్ష

Chandrababu deeksha: చంద్రబాబు సంచలన నిర్ణయం.. 36 గంటల పాటు నిరసన దీక్ష

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu naidu: గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల పాటు కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబునాయుడు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు టీడీపీ ప్రకటన విడుదల చేసింది.

    ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు (AP Politics)  రచ్చకెక్కాయి.  పార్టీ ఆఫీసులపై దాడులు, వైసీపీ (YCP)- టీడీపీ (TDP) పోటీ పోటీ నిరసనలు, నేతల మాటల తూటాలతో.. రచ్చ జరుగుతోంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కార్యాలయాలు, పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా 36 గంటల పాటు దీక్ష చేయనున్నారు. 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరుతో దీక్ష చేయబోతున్నారు చంద్రబాబు. గురువారం ఉదయం 8 గంటల నుంచి  శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల పాటు  కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబునాయుడు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు టీడీపీ ప్రకటన విడుదల చేసింది. నిన్న జరిగిన పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ''రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పేట్రేగిపోతోంది.  ఫ్యాక్షనిజానికి అధికారం తోడయ్యింది.  దీనిలో పోలీసులు  అంతర్భాగమయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించింది.  ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూక దాడులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరతీశారు.  ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం.  ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై మూక దాడి చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు.  అక్కడున్న టీడీపీ నేతలు, సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు.  కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కుట్రతో పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేశారు.  కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికి పోయేలా దాడులకు తెగబడ్డారు.  నిన్నటి రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ముఖ్యమంత్రి, డీజీపీ ప్రోద్బలంతోనే ప్రతిపక్ష పార్టీ నేతలపై భౌతిక దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసానికి పాల్పడ్డారు.  ప్రజాసమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది.  దీనిని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం దమనకాండను మొదటినుంచీ కొనసాగిస్తోంది. దీనిని నిలువరించాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రంలోని ప్రతి పౌరునిపై ఉంది. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు ప్రజలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలిసి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.'' అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

    Police Case on Lokesh: టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ట్విస్ట్.. లోకేష్ పై హత్యాయత్నం కేసు..

    మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. దాడి జరిగిన తర్వాత అక్కడికి వచ్చి సీఐ నాయక్ పై దాడి చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో కేసులో ఏ-1గా లోకేష్, ఏ-2గా అశోక్ బాబు, ఏ-3 ఆలపాటి రాజా, ఏ-4గా తెనాలి శ్రావణ్ కుమార్ ను చేర్చారు. వీరిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో 70మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది.

    AP Political Fight: టీడీపీని నిషేధించాలి... ఈసీని కోరతామన్న బొత్స...

    నిన్న టీడీపీ కార్యాలయంలోకి కొందరు అల్లరిమూకలు చొరబడి దాడిచేసిన విషయం తెలిసిందే. ఐతే వ్యక్తిని టీడీపీ నేతలు పట్టుకున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఇతడు కూడా ఉన్నారంటూ ప్రెస్‌మీట్ పెట్టి.. మీడియాకు చూపించారు. ఐతే ఆయన వైసీపీ కార్యకర్తకాదు.. సీఐ నాయక్. తాను పోలీస్ అని చెప్పినా.. టీడీపీ నేత అశోక్ బాబు నమ్మలేదు. ఐడీ కార్డు చూపించాలని అడిగారు. మఫ్టీలో ఉన్నానని, ఐడీ కార్డు లేదని సీఐ నాయక్ చెప్పారు.

    YS Jagan: పట్టాభి తిట్లపై సీఎం జగన్ ఫస్ట్ రియాక్షన్.. ఇన్ని బూతులు ఎప్పుడూ వినలేదు

    ఈ క్రమంలోనే లోకేష్, అశోక్ బాబుతో పాటు ఇతర టీడీపీ కార్యకర్తలపై సీఐ నాయక్ కేసు పెట్టారు. హత్యాయత్నంతో పాటు ఎస్పీ,ఎస్టీ అట్రాసిటీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంపై తనపై దాడి చేశారని.. అంతేకాకుండా ప్రెస్ మీట్‌లో మీడియా ముందు తన మాస్క్ తీయించి, దోషిగా చూపే ప్రయత్నం చేశారని సీఐ నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లోకేష్‌పై హత్యాయత్నం కేసు నమోదవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మా కార్యాలయాలపై దాడులు చేసిందే కాకుండా.. తిరిగి మాపైనే హత్యాయత్నం కేసులు పెడతారా? అని మండిపడుతున్నారు.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu, TDP

    ఉత్తమ కథలు