కిరణ్ కుమార్ రెడ్డికి మళ్లీ కీలక పదవి... ఆయన కాదంటే...

కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి కాంగ్రెస్‌లో క్రియాశీలకం కాబోతున్నారనే వార్తలు మొదలయ్యాయి.

news18-telugu
Updated: November 21, 2019, 5:38 PM IST
కిరణ్ కుమార్ రెడ్డికి మళ్లీ కీలక పదవి... ఆయన కాదంటే...
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి (ఫైల్ ఫొటో)
  • Share this:
ఏపీ కాంగ్రెస్‌కు కొత్తగా అధ్యక్షుడు రాబోతున్నారా ? రఘువీరారెడ్డి రాజీనామా తరువాత పెండింగ్‌లో ఉన్న ఏపీ పీసీసీ చీఫ్ పోస్టు మాజీ ముఖ్యమంత్రికి దక్కనుందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి... కొన్నేళ్ల తరువాత మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే కాంగ్రెస్‌లో ఆయన ఎలాంటి కీలక బాధ్యతలు తీసుకోలేదు. లోక్ సభ ఎన్నికల తరువాత కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వెళతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆయన మాత్రం అటు వైపు అడుగులు వేసిన దాఖలాలు కనిపించలేదు.

తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి కాంగ్రెస్‌లో క్రియాశీలకం కాబోతున్నారనే వార్తలు మొదలయ్యాయి. కిరణ్‌కుమార్‌రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కిరణ్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారని... ఢిల్లీ రావాల్సిందిగా ఆయనను కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లికి వెళ్లారు. ఏపీసీసీ అధ్యక్షుడిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించేందుకు కాంగ్రెస్‌ చూస్తోందని తెలుస్తోంది.

ఏపీసీసీ అధ్యక్షుడి పదవికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఉమెన్‌ చాందీ కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును ప్రతిపాదించడంతో... కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఏపీ పీసీసీ చీఫ్ పదవి తీసుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి విముఖంగా ఉన్నారనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ కిరణ్ కాదంటే... ప్రత్యామ్నాయంగా పళ్లంరాజు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.



First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు