హోమ్ /వార్తలు /రాజకీయం /

మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు

మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు

చంద్రబాబు, నరేంద్రమోదీ

చంద్రబాబు, నరేంద్రమోదీ

నూతన విద్యా విధానాన్ని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమని.. నూతన విద్యా విధానంతో విద్యా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.

విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేసింది కేంద్రం. అందరికీ విద్య అందించాలన్న లక్ష్యంతో పాటు విద్యార్థులపై పాఠాల భారం తగ్గించాలన్న ఉద్దేశ్యంతో నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. 30 ఏళ్ల నాటి విద్యా విధానాన్ని స్వస్తిచెప్పి కొత్త విద్యా విధానానికి కేంద్రకేబినెట్ ఆమోద ముద్రవేసింది. దీన్ని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమని.. నూతన విద్యా విధానంతో విద్యా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. యువత ప్రపంచంతో పోటీపడేలా బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం వల్లే విద్యార్థుల ఆలోచనా విధానం మెరుగవడంతో పాటు విద్యా నైపుణ్యాలు పెరుగతాయని అన్నారు.


కాగా, విద్యా హక్కు చట్టం కింద 3 నుంచి 18 ఏళ్ల వరకు విద్యను తప్పనిసరి చేశారు. 5వ తరగతి వరకు మాత‌ృభాషలోనే విద్యా బోధన చేయనున్నారు. గతంలో ఉన్న 10+2 స్థానంలో 5+3+3+4ను అమలు చేయనున్నారు. మొదటి ఐదేళ్లను ఫౌండేషన్ కోర్సు(3 ఏళ్ల వయసు నుంచి 8 ఏళ్ల వరకు), ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ (8 ఏళ్ల వయసు నుంచి 11 వరకు), ఆ తర్వాత మూడేళ్లను ప్రిపరేటరీ స్టేజ్ (11 ఏళ్ల నుంచి 14 వరకు), ఆ తర్వాతి నాలుగేళ్లను సెకండరీ స్టేజ్‌ (14 ఏళ్ల వయసు నుంచి 18 వరకు)గా పరిగణిస్తారు. డిప్లొమా కోర్సు రెండేళ్లు, వృత్తి విద్య కోర్సు వ్యవధి ఏడాదిగా నిర్ణయించారు. అలానే డిగ్రీ కోర్సు కాల వ్యవధి మూడు లేదా నాలుగేళ్లుగా మార్పు చేయనున్నారు.

First published:

ఉత్తమ కథలు