విశాఖ వెంకోజిపాలెంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు

ఉదయం హైదరాబాదు నుండి స్పైస్ జెట్ విమానంలో విశాఖ చేరుకున్నారు చంద్రబాబు

news18-telugu
Updated: October 21, 2019, 1:06 PM IST
విశాఖ వెంకోజిపాలెంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 21, 2019, 1:06 PM IST
ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఏపీలో పలు ప్రాంతల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సదర్భంగా వెంకోజిపాలెంలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రశ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా బయల్దేరి వెళ్లారు. ఉదయం హైదరాబాదు నుండి స్పైస్ జెట్ విమానంలో విశాఖ చేరుకున్నారు చంద్రబాబు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన శ్రీకాకుళం ఎన్టీఆర్ భవన్ కు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ, రేపు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. సమీక్షల అనంతరం మంగళవారం రాత్రికి విశాఖ చేరుకొని అక్కడ్నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...