Home /News /politics /

AP EX CM CHANDRABABU NAIDU SHORTLY WILL START TO CHALO ATMAKUR SB

ఛలో ఆత్మకూరు ఆగదు... మరికాసేపట్లో బయల్దేరుతాం: చంద్రబాబు

చంద్రబాబు(ఫైల్ ఫోటో)

చంద్రబాబు(ఫైల్ ఫోటో)

ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదన్నారు. ‘‘ఛలో ఆత్మకూరు’’ కార్యక్రమం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

    మరికాసేపట్లో ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతామని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉండవల్లిలో తన నివాసంలో అందుబాటులో వున్నాటిడిపి సీనియర్ నేతలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కళా వెంకట్రావు, కాలువ శ్రీనివాసులు, చినరాజప్ప,లోకేష్, రామానాయుడు, నాగేశ్వర్ రెడ్డి, రామరాజు పాల్గొన్నారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమంపై చర్చించారు. ప్రశాంతంగా జరిగే ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం గర్హనీయమన్నారు చంద్రబాబు.

    బాధితులకు న్యాయం చేయకుండా, న్యాయం చేయమని అడిగేవారిని అణిచేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. పోలీసులు అప్పుడే సమర్ధంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదన్నారు. ‘‘ఛలో ఆత్మకూరు’’ కార్యక్రమం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులకు పాలు-నీళ్లు, భోజనం అడ్డుకోవడం నిర్బంధం కాదా..? అంటూ మండిపడ్డారు. శిబిరానికి వచ్చే భోజనాలు అడ్డుకుంటారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. నా ఇంటికి వచ్చే మీడియాను వెంటబడి తరుముతారా..? ఎన్నిరోజులు తనను హౌస్ అరెస్ట్ చేస్తారు..? అంటూ ప్రభుత్వ వైఖరిని నిలదీశారు మాజీ సీఎం.  ఇంత పెద్ద ఎత్తున హౌస్ అరెస్ట్‌లు చరిత్ర లేవన్నారు. ఇంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం ఇదే తొలిసారన్నారు

    వైసిపి ప్రభుత్వ అణిచివేత వైఖరిని అందరూ గర్హించాలని పిలుపునిచ్చారు. ప్రజా సంఘాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. నివసించే హక్కు, ఆస్తులు కాపాడుకునే హక్కు అందరికీ ఉందన్నారు చంద్రబాబు. బాధితులకు న్యాయం చేయడంలో సర్కార్ విఫలం అయిందని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని చూస్తున్నారన్నారు. ఆత్మకూరు బాధితులను నేనే గ్రామానికి తీసుకెళ్తానన్నారు చంద్రబాబు. ఈ రోజు ఉదయం 11 గంటలకే ఆత్మకూరుకు బయల్దేరుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: AP News, AP Politics, Chalo athmakuru, Chandrababu naidu, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు