కోడెలది ప్రభుత్వ హత్య... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మరే వ్యక్తికీ కోడెలలాంటి పరిస్థితి రాకూడదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు.. ఆలిండియా సర్వీస్‌ ఉద్యో గులు సరెండర్‌ అయ్యారని ఆరోపించారు.

news18-telugu
Updated: September 17, 2019, 9:54 AM IST
కోడెలది ప్రభుత్వ హత్య...  చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కోడెల, చంద్రబాబు
news18-telugu
Updated: September 17, 2019, 9:54 AM IST
మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై నమోదైన కేసులపై స్పందించారు మాజీ సీఎం చంద్రబాబు. కోడెల మృతదేహానికి  ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నివాళులర్పించిన ఆయన... పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. కోడెల ఆత్మహత్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు  చంద్రబాబువైసీపీ ప్రభుత్వం ఉన్మాదిలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా భయభ్రాంతులకు గురిచేయడానికే... ప్రజావేదికను కూల్చేశారన్నారు. తన ఇంటిని కూడా ముంచేందుకు యత్నించారని పేర్కొన్నారు.

మొత్తం తప్పుడు సమాచారాన్ని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ తప్పు చేయని నన్నపనేని, అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టించారన్నారు. కుటుంబరావుపై తప్పుడు కేసులు బనాయించారని చంద్రబాబు పేర్కొన్నారు. కోడెలది ప్రభుత్వం చేసిన హత్య అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కోడెల మృతిపై ప్రతి ఇంట్లో, మేధావుల్లో చర్చ జరగాలన్నారు. మరే వ్యక్తికీ కోడెలలాంటి పరిస్థితి రాకూడదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు.. ఆలిండియా సర్వీస్‌ ఉద్యో గులు సరెండర్‌ అయ్యారని ఆరోపించారు.

తప్పుచేసిన వాడికి శిక్ష వేస్తే నేనూ అభినందించేవాడినన్నారు చంద్రబాబు. కుమారుడు, కూతురు వేధింపుల వల్లే... కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు వాపోయారు. శివరాం విదేశాల్లో కాకుండా ఇక్కడే ఉండుంటే... కోడెలను ఆయనే చంపాడని కేసులు పెట్టేవారని చంద్రబాబు పేర్కొన్నారు.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...