దిశ స్కూటీకి టోల్‌ కట్టిందన్న జగన్... చంద్రబాబు సెటైర్లు

జగన్ ఏదో పొరపాటుతో అలా మాట్లాడి ఉంటారేమోనని నేను అనుకుంటున్నాన్నారు. మాట్లాడాలనుకుంటే... విమర్శలు చేయాలనుకుంటే తాను కూడా ఎన్నో చేయగలనంటూ వైసీపీకి ధీటైనా సమాధానం ఇచ్చారు చంద్రబాబు. చ

news18-telugu
Updated: December 11, 2019, 3:17 PM IST
దిశ స్కూటీకి టోల్‌ కట్టిందన్న జగన్... చంద్రబాబు సెటైర్లు
చంద్రబాబు, జగన్
  • Share this:
రెండో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు ఆసక్తికరంగా సాగాయి. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యల్ని ఎద్దేవా చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు. దీనికి ఘాటుగా సమాధానం ఇచ్చారు చంద్రబాబు. దిశ హత్యాచార ఘటననే ప్రస్తావిస్తూ... టోల్ ప్లాజాలో స్కూటీకి ఎవరైనా టోల్ కడతారా ? అంటూ జగన్ సోమవారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. జగన్ ఏదో పొరపాటుతో అలా మాట్లాడి ఉంటారేమోనని నేను అనుకుంటున్నాన్నారు. మాట్లాడాలనుకుంటే... విమర్శలు చేయాలనుకుంటే తాను కూడా ఎన్నో చేయగలనంటూ వైసీపీకి ధీటైనా సమాధానం ఇచ్చారు చంద్రబాబు. చదువుల కోసం అమెరికా పంపిస్తే... జగన్ పారిపోయి ఇండియాకు వచ్చేశారన్నారు. తన కొడుకు మాత్రం అమెరికాలో చదువు పూర్తి చేశాడని చెప్పుకొచ్చారు.

సోమవారం అసెంబ్లీలో మహిళల భద్రత కోసం చర్చిస్తూ.. జగన్ దిశా హత్యాచార కేసు, ఎన్‌కౌంటర్ ఘటనల్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... దిశ టోల్ ప్లాజాలో స్కూటీ నిలిపి టోల్ కట్టేందుకు వెళ్తే... ఆ అమ్మాయి స్కూటీని నలుగురు నిందితులు పంక్చర్ చేశారన్నారు.దీనిపై పలువురు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేశారు. టోల్ ప్లాజాలో స్కూటీకి టోల్ ఫీజు ఉంటుందా ? అని ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు ఆ అంశాన్నే చంద్రబాబు కూడా సభలో లేవనెత్తారు.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>