ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో కోడెలకు చంద్రబాబు నివాళి

మానసిక క్షోభతోనే ఆయన చనిపోయారన్న మాజీ సీఎం.. కోడెల మరణించారంటే సిగ్గుపడాలని అన్నారు. ఇంకెంత మంది నాయకులు వీళ్ల దౌర్జన్యాలకు బలైపోవాలని మండిపడ్డారు చంద్రబాబు.

news18-telugu
Updated: September 17, 2019, 9:36 AM IST
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో కోడెలకు చంద్రబాబు నివాళి
మానసిక క్షోభతోనే ఆయన చనిపోయారన్న మాజీ సీఎం.. కోడెల మరణించారంటే సిగ్గుపడాలని అన్నారు. ఇంకెంత మంది నాయకులు వీళ్ల దౌర్జన్యాలకు బలైపోవాలని మండిపడ్డారు చంద్రబాబు.
  • Share this:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కోడెల పార్థివదేహానికి నివాళి అర్పించారు. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అంజలి ఘటించారు. అనంతరం కాసేపు మౌనం పాటించారు. కోడెలకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు చంద్రబాబు. ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని విధాలుగా కోడెలను ఇబ్బందిపెట్టారని వైసీపీపై విమర్శలు గుప్పించారు. మానసిక క్షోభతోనే ఆయన చనిపోయారన్న మాజీ సీఎం.. కోడెల మరణించారంటే సిగ్గుపడాలని అన్నారు. ఇంకెంత మంది నాయకులు వీళ్ల దౌర్జన్యాలకు బలైపోవాలని మండిపడ్డారు చంద్రబాబు.

అంతకుముందు కోడెల పార్థివదేహానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణతో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమ, కేఈ కృష్ణమూర్తి, ఫరూక్‌ నివాళి అర్పించారు. మంగళవారం ఉదయం 8 గంటల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనే కోడెల భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరు తీసుకెళ్తారు. అక్కడ ఏపీ కార్యకర్తలు, అభిమానులు సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో ఉంచుతారు. కెన్యాలో ఉన్న కోడెల కుమారుడు గుంటూరు చేరుకున్నాక మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading