HOME »NEWS »POLITICS »ap ex cm chandrababu naidu meet governor narasimhan in hyderabad ak

గవర్నర్‌తో చంద్రబాబు భేటీ... అరగంటకు పైగా ఏకాంత చర్చలు

గవర్నర్‌తో చంద్రబాబు భేటీ... అరగంటకు పైగా ఏకాంత చర్చలు
గవర్నర్ నరసింహన్‌ను కలిసిన చంద్రబాబు

ఉదయం రాజ్ భవన్‌కు వెళ్లిన చంద్రబాబునాయుడు... గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ మాత్రమే అని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

  • Share this:
    తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఉదయం రాజ్ భవన్‌కు వెళ్లిన చంద్రబాబునాయుడు... గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ మాత్రమే అని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించిన చంద్రబాబునాయుడు... అప్పటి నుంచి గవర్నర్‌ను కలవలేదు .ఈ కారణంగానే చంద్రబాబు రాజ్ భవన్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య పలు అంశాలపై చర్చ సాగినట్టు సమాచారం. అయితే ఈ సమావేశంలోనే చంద్రబాబు గవర్నర్‌తో 30 నిమిషాలకు పైగా ఏకంతంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి గవర్నర్ హాజరుకానున్న నేపథ్యంలో... అంతకుముందే చంద్రబాబు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌తో చర్చలు జరపడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

    First published:June 07, 2019, 12:48 IST