కేంద్రానికి చంద్రబాబు లేఖ... ఆర్థికమంత్రికి ప్రత్యేక వినతి

ఆంధ్రాబ్యాంక్ విలీనాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

news18-telugu
Updated: September 4, 2019, 8:34 AM IST
కేంద్రానికి చంద్రబాబు లేఖ... ఆర్థికమంత్రికి ప్రత్యేక వినతి
చంద్రబాబు నాయుడు(File)
  • Share this:
కేంద్రానికి లేఖ రాశారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  ఆంధ్రాబ్యాంక్‌ను యూనియన్ బ్యాంకులో విలీనం చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయమై చంద్రబాబు స్పందించారు. ఆంధ్రా బ్యాంకును విలీనం  వద్దంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపేలా ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపడుతోందని ఆయన కొనియాడారు. కానీ ఆంధ్రాబ్యాంక్ విలీనాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రాబ్యాంక్ విలీనం కావడం అనేది తెలుగు ప్రజల భావోద్వేగంతో ముడిపడి ఉందన్నారు. ఒకవేళ విలీనం తప్పనిసరైతే.. కొత్తగా ఏర్పడబోయే బ్యాంకుకి ఆంధ్రాబ్యాంక్‌ అనే పేరునే కొనసాగించాలని ఆర్థిక మంత్రిని చంద్రబాబు నాయుడు కోరారు.

ఇప్పటికే ఏపీకీ చెందని కొంతమంది నాయకులు ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారు. ఎంపీ బాలశౌరీ, కాంగ్రెస్ నేత కేవీపీ తదితరులు ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రికి  విజ్ఞప్తి చేశారు. విలీనం తప్పనిసరైతే.. ఆంధ్రా బ్యాంకు పేరునే కొనసాగించాలని, ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని ఎంపీ బౌలశౌరీ డిమాండ్ చేశారు. 1923 నవంబర్ 20 పట్టాభి సీతారామయ్య మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రాబ్యాంకును ఏర్పాటు చేశారు. 1980లో ఇందిరా హయాంలో ఈ బ్యాంకును జాతీయం చేశారు.
Published by: Sulthana Begum Shaik
First published: September 4, 2019, 8:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading