వైఎస్ వివేక హత్య కేసు విచారణపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పులివెందుల పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా జరగదని... ఆయనను పులివెందులకు పంపేదాకా వెనుకాడబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు.

news18-telugu
Updated: October 14, 2019, 4:59 PM IST
వైఎస్ వివేక హత్య కేసు విచారణపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు, వైఎస్ వివేకానందరెడ్డి
news18-telugu
Updated: October 14, 2019, 4:59 PM IST
ఏపీ సీఎం జగన్ బాబాయ్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకాను సుపారీ హత్యచేస్తే విచారణకు దిక్కులేదని సీఎం జగన్‌పై ఆయన మండిపడ్డారు. జగన్ పాలనలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. వైసీపీ నేతలు దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విరుచుకుపడ్డారు. మాజీ స్పీకర్ కోడెలను వేధించి చంపారన్న చంద్రబాబు.. జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతలను కాపాడామన్నారు చంద్రబాబు. కొంతమంది పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. ప్రభుత్వానికి స్టిక్కర్ల మాదిరిగా తయారయ్యారని ధ్వజమెత్తారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఖబడ్దార్‌ అని చంద్రబాబు హెచ్చరించారు మాజీ సీఎం. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. జగన్‌తో జైలుకు వెళ్లినవారికి ఉన్నత పదవులు ఇచ్చారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ను జీవితాంతం జైలులో పెట్టినా చాలదని అభిప్రాయపడ్డారు. పులివెందుల పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా జరగదని... ఆయనను పులివెందులకు పంపేదాకా వెనుకాడబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...