జగన్ ఇల్లు జగన్ పేరుతో ఉందా?... డాక్యుమెంట్లు చూపించమంటూ చంద్రబాబు సవాల్...

Andhra Pradesh : బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదికపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కల నాశనమైపోతోందని ఆవేదన చెందారు.

news18-telugu
Updated: January 4, 2020, 7:28 AM IST
జగన్ ఇల్లు జగన్ పేరుతో ఉందా?... డాక్యుమెంట్లు చూపించమంటూ చంద్రబాబు సవాల్...
చంద్రబాబు
  • Share this:
Andhra Pradesh : ఏపీలో సింగపూర్ తరహా నగరాన్ని నిర్మించాలనీ, తద్వారా భూముల ధరలు పెరుగుతాయని తాము ప్లాన్ వేసినట్లు చెప్పారు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (BCG)... ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టుపై స్పందించిన ఆయన... తాము రైతులకు ఎకరంలో నాలుగో వంతు ఇస్తామని హామీ ఇవ్వడంతో... రైతులు 32 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లకు పైగా అవుతుందన్న BCG రిపోర్టును చంద్రబాబు తప్పుపట్టారు. అంత ఎందుకు అవుతుందన్న ఆయన... హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ, అన్నీ ఏసీ రూంలు, డీజీపీ ఆఫీస్, ఇరిగేషన్ ఆఫీస్, ఆర్ అండ్ బీ ఆఫీస్, చాలా శాఖలు కూడా అమరావతిలో ఆల్రెడీ ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులకు క్వార్టర్స్ కూడా సిద్ధమవుతున్నాయన్న చంద్రబాబు... దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టామన్నారు. మరో రూ.4వేల కోట్లు ఖర్చు పెడితే... భవనాలన్నీ రెడీ అవుతాయన్న చంద్రబాబు... ఆల్రెడీ మిగిలివున్న 10వేల ఎకరాల భూమిని అమ్మితే వచ్చే డబ్బుతో... అభివృద్ధి చెయ్యవచ్చనీ, ఉద్యోగాలు కల్పించవచ్చనీ అన్నారు. ఈ ఆలోచన మానేసి... BCG రిపోర్టులో అర్థం పర్థం లేని అంశాల్ని చేర్చారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రులు అమరావతిలో, సెక్రటేరియట్ విశాఖలో ఎందుకన్న చంద్రబాబు... మంత్రులు, అధికారులూ అందరూ ఒకే చోట ఉండాలన్న కాన్సెప్ట్‌తో అమరావతిని ఎంపిక చేశామన్నారు. తద్వారా ఏ పనైనా నిమిషాల్లో అయిపోతుందన్నారు. BCG రిపోర్టుకి తలా తోకా లేదన్న చంద్రబాబు... 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకి సంబంధించిన అంశంపై... ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ కట్టుకున్న ఇల్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కిందకు వస్తుందన్న చంద్రబాబు... ఆ ఇల్లు జగన్ పేరుతో ఉందా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలంటూ సవాల్ విసిరారు. ఆ ఇల్లు బినామీ పేరుతో ఉందన్న చంద్రబాబు... జగన్ ఏం చేసినా న్యాయం ధర్మం అని చెప్పుకుంటున్నారని సీరియస్ అయ్యారు.

First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు