రాజకీయం అంటే తమాషానా..? సీఎం జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)

తనపై అక్కసుతోనే ప్రజావేదికను కూల్చివేశారన్న చంద్రబాబు.. అన్నా క్యాంటీన్ల ఏం చేశాయని, వాటిని ఎందుకు రద్దు చేశారని మండిపడ్డారు.

 • Share this:
  ఏపీలో కావాలనే కృత్రిమ కొరత సృష్టించారని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ ప్రజల నుంచి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక కొరతకు నిరసనగా విజయవాడలోని ధర్నాచౌక్‌లో 12 గంటల పాటు దీక్ష చేపట్టారు చంద్రబాబు. అనంతరం దీక్షా స్థలి వద్ద ప్రసంగించిన ఆయన.. సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్‌కు ధన దాహం ఉందని.. డబ్బుకు ఆశపడే కొత్త ఇసుక విధానం తీసుకొచ్చారని విరుచుకుపడ్డారు. ఏం.. రాజకీయం అంటే తమాషానా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు చంద్రబాబు.

  జగన్‌కు డబ్బు పిచ్చి ఉంది. డబ్బుకు ఆశపడే కొత్త ఇసుక విధానం తీసుకొచ్చారు. బలవంతంగా ప్రజల ఆస్తులను రాయించుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. పేదవాడి ప్రాణాలు పోయి.. వారి బతుకులు చితికిపోయినా జగన్ పట్టించుకోవడం లేదు. జగన్‌కు మనుషుల విలువ తెలియదు. 35 లక్షల మంది కోసం మేం దీక్ష చేస్తుంటే.. ఆ సమయంలో మా పార్టీ నేతలను చేర్చుకుంటారా..? ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు చనిపోతే కాలంతీరి చనిపోయారని మంత్రులు అంటారా? పేదల ప్రాణాలంటే మీకు తామాషాగా ఉందా.? మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే మాట్లాడతారా?
  చంద్రబాబు నాయుడు


  తనపై అక్కసుతోనే ప్రజావేదికను కూల్చివేశారన్న చంద్రబాబు.. అన్నా క్యాంటీన్ల ఏం చేశాయని, వాటిని ఎందుకు రద్దు చేశారని మండిపడ్డారు. టీడీపీ నుంచి నేతలను చేర్చుకుంటున్నారని.. ఒకరు వెళ్తే వంద మంది నాయకులను తయారు చేస్తానని స్పష్టం చేశారు మాజీ సీఎం. జగన్ లాంటి కుటిల రాజకీయాలు చేసే నాయకులను ఎంతో మందని చూశానని చెప్పుకొచ్చారు. ప్రజల ముందు వైసీపీ ప్రభుత్వాన్నీ దోషిగా నిలబెడతానని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
  Published by:Shiva Kumar Addula
  First published: