కోడెల ఆత్మహత్యపై చంద్రబాబు సంచలన కామెంట్స్..

కోడెల శివప్రసాదరావును ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారని, వారిపై ఆయన వీరోచితంగా పోరాడినా ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 17, 2019, 9:57 PM IST
కోడెల ఆత్మహత్యపై చంద్రబాబు సంచలన కామెంట్స్..
కోడెల, చంద్రబాబు
  • Share this:
కోడెల శివప్రసాదరావును ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారని, ఆయన వీరోచితంగా పోరాడినా ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల ఫర్నీచర్ తీసుకెళ్లడంపై మాట్లాడిన బాబు.. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నగదు రూపంలో గానీ, ఫర్నిచర్ గానీ ఇవ్వడం ఆనవాయితీ అని, స్పీకర్‌గా ఉన్న ఆయనకు కూడా ఫర్నీచర్ ఇచ్చారని వెల్లడించారు. గతంలో చాలా పనులు ఉండటం వల్ల తాను వాటిని క్యాంప్ ఆఫీస్‌కు గానీ, ఇంట్లో గానీ వాడుకొంటారని, కొన్ని కొన్ని విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వదిలేస్తారని చెప్పారు. అయినా కూడా.. కోడెల ఫర్నీచర్ కోసం జూన్ 9న లేఖ రాసి, ఆ తర్వాత పదే పదే సామాగ్రి గానీ, డబ్బులు చెల్లిస్తానని చెప్పారని గుర్తు చేశారు. దీనిపైఆగస్టు 20న స్పీకర్ కూడా లేఖ తీసుకున్నారని అన్నారు.

వాస్తవానికి, గతంలో చాలా పనులు ఉండటం వల్ల తాను ఈ కేసు వివరాల్లోకి వెళ్లలేదని.. నరసరావుపేట ఎమ్మెల్యే 22న కంప్లైంట్ చేయడం.. ఆ తర్వాత 24న అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు చేశారని చంద్రబాబు అన్నారు. ఫర్నీచర్ గురించి కోడెల లేఖలు రాసినా.. రూ. 1 లక్ష, లక్షన్నర ఖరీదు చేసే ఫర్నీచర్ కోసం సెక్షన్ 409 కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టారని విమర్శించారు. వైసీపీ నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నా సీఎం జగన్ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఘటనపై ప్రజలకు వివరణ ఇవ్వకపోతే వారి ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>