AP EX CHANDRABABU NAIDU REACTS ON VALLABHANENI VAMSI RESIGNATION SK
వల్లభనేని వంశీ రాజీనామాపై స్పందించిన చంద్రబాబు
చంద్రబాబు, వల్లభనేని వంశీ
వైసీపీ వేధింపులను, తమకు జరిగిన అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని.. దీనిపై రాజ్యాంగ అధిపతులకు ఫిర్యాదు చేద్దామని తెలిపారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన రాసిన రాజీనామా లేఖపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీకి చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ వేధింపులను, తమకు జరిగిన అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని.. దీనిపై రాజ్యాంగ అధిపతులకు ఫిర్యాదు చేద్దామని తెలిపారు. ఎప్పుడు, ఎక్కడ అన్యాయం జరిగినా తల దించుకోకుండా పోరాటం చేయడం మన బాధ్యత అని పేర్కొన్నారు మాజీ సీఎం.
కాగా, ఎమ్మెల్యే పదవి, టీడీపీ సభ్యత్వానికి వల్లభనేని వంశీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. వైసీపీ నేతలు, కొందరు అధికారుల తీరు వల్ల కేడర్ ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుట్ర రాజకీయాలతో తాను, తన అనచరులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయామని.. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లో చంద్రబాబు తనకు మంచి అవకాశాలు కల్పించారని.. ఆయనకు ధన్యవాదాలని లేఖలో పేర్కొన్నారు వంశీ.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.