స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ రాళ్ల దాడి..

స్పీకర్ కోడెల గన్ మెన్‌కు కూడా దెబ్బలు తగిలాయి. వారు కూడా స్పృహ తప్పి పడిపోయారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: April 11, 2019, 12:51 PM IST
స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ రాళ్ల దాడి..
వైసీపీ రాళ్ల దాడిలో గాయపడిన కోడెల శివప్రసాదరావు
news18-telugu
Updated: April 11, 2019, 12:51 PM IST
సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి జరిగింది. నియోజకవర్గంలోని రాజపాలెంలోని ఇనిమెట్ల గ్రామంలో సభాపతి మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్ల దాడి చేయడంతో స్పీకర్ కోడెల తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్ర అంగన్ వాడీ యూనియన్ నేత భీమినేని వందన కూడా దాడిలో గాయపడ్డారు. స్పీకర్ కోడెల గన్ మెన్‌కు కూడా దెబ్బలు తగిలాయి. వారు కూడా స్పృహ తప్పి పడిపోయారు.  వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిని కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. అంతకు ముందు కోడెల శివప్రసాదరావు ఓ పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లి తలుపులు మూసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై వైసీపీ పోలింగ్ ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ కోడెలను పోలీసులు బలవంతంగా బయటకు లాక్కుని వచ్చారు. ఈ సందర్భంగా కోడెల స్పృహతప్పి పడిపోయారు.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...