AP elections exit poll survey 2019: ఏపీ ఫలితాలపై అదే సస్పెన్స్... క్లారిటీ ఇవ్వని ఎగ్జిట్ పోల్స్‌

AP elections exit poll survey 2019: లగడపాటి రాజగోపాల్ సర్వే ఏపీలో అధికారం టీడీపీదే అని చెబుతుంటే... మిగతా ఎగ్జిట్ పోల్స్ మాత్రం భిన్నంగా ఉన్నాయి.

news18-telugu
Updated: May 19, 2019, 7:49 PM IST
AP elections exit poll survey 2019: ఏపీ ఫలితాలపై అదే సస్పెన్స్... క్లారిటీ ఇవ్వని ఎగ్జిట్ పోల్స్‌
చంద్రబాబు, వైఎస్ జగన్ (File)
  • Share this:
ఏపీ ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయనే అంశంపై మళ్లీ సస్పెన్స్ కొనసాగుతోంది. మెజార్టీ కాస్త అటు ఇటుగా ఉన్నా... మరోసారి టీడీపీదే అని ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమమే మరోసారి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కానున్నాయని ఆయన తన సర్వే అంచనాలను వెల్లడించారు. టీడీపీకి 90-110, వైసీపీకి 65-79 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇక ఐఎన్ఎస్ఎస్ సర్వే సైతం మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసింది. టీడీపీకి 118, వైసీపీకి 52, జనసేనకి 5 సీట్లు వస్తాయని ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది.

లగడపాటి సర్వే ఇలా ఉంటే... మిగతా ఎగ్జిట్ పోల్స్ మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఏపీలో వైసీపీకి 130-135 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. వీడీపీ అసోసియేట్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 111-121 స్థానాలు, 54-60 స్థానాలు రానున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను అంచనా వేయడంలో సక్సెస్ సాధించిన సీపీఎస్ సర్వే సంస్థ... ఏపీలో వైసీపీకీ 130-133 సీట్లు, టీడీపీకి 43-44 సీట్లు వస్తాయని అంచనా వెల్లడించింది.

First published: May 19, 2019, 7:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading