ఏపీలో మరోసారి రీ పోలింగ్? ఎక్కడెక్కడంటే..

ఈనెల 19న చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. మే 21న ఈ రెండు పోలింగ్ బూత్‌లో రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: May 17, 2019, 7:09 PM IST
ఏపీలో మరోసారి రీ పోలింగ్? ఎక్కడెక్కడంటే..
ఓటు వేసేందుకు వచ్చిన మహిళలు (File)
news18-telugu
Updated: May 17, 2019, 7:09 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రీ పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని రెండు పోలింగ్ స్టేషన్లలో అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన ఏరియాలోని సీసీటీవీ కెమెరాలను అధికారులు పరిశఈలించారు. ఈ క్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెంబర్ 310, బూత్ నెంబర్ 323లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. దీంతో ఆ రెండు చోట్లా రీ పోలింగ్ నిర్వహించాలంటూ చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈనెల 19న చివరి విడుత ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. మే 21న ఈ రెండు పోలింగ్ బూత్‌లో రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...