'చంద్రబాబు సహా ఆ ఇద్దరూ జైలుకు'..ఈసీకి వైసీపీ నేతల ఫిర్యాదు

స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని వైసీపీ నేలు ఈసీని కోరారు. 2014, ఉప ఎన్నికల్లో ఈవీఎంపై నమ్మకం ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఎందుకు లేదని ప్రశ్నించారు.

news18-telugu
Updated: April 15, 2019, 6:37 PM IST
'చంద్రబాబు సహా ఆ ఇద్దరూ జైలుకు'..ఈసీకి వైసీపీ నేతల ఫిర్యాదు
విజయసాయిరెడ్డి, చంద్రబాబు
news18-telugu
Updated: April 15, 2019, 6:37 PM IST
పోలింగ్ రోజున ఏపీలో టీడీపీ నేతలు హింసకు పాల్పడ్డారని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తొత్తులు ఎస్పీలు ఉన్న చోటే హింసలు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని..అందుకే ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన విజయసాయిరెడ్డి నేతృత్వంలోని బృందం.. టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. అటు ఈ-ప్రగతి పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారని...ఈ కేసులో సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు జైలుకెళ్తారని చెప్పారు విజయసాయిరెడ్డి.

పోలింగ్ రోజున టీడీపీ నేతలు హింసకు పాల్పడ్డారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ పోలింగ్ బూతులోకి వెళ్లి అక్రమాలకు పాల్పడ్డారు. సానుభూతి కోసం చొక్కాలు చించుకున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే సూరి మా కార్యకర్తలపై దాడిచేశారు. టీడీపీ అరాచకాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. వైసీపీ గెలుస్తుందని సొంత ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడంతో ఈ డ్రామాలు ఆడుతున్నారు. చంద్రబాబు మాటల్ని జాతీయ పార్టీల నేతలు నమ్మవద్దు.
విజయసాయిరెడ్డి


కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమయిందన్నారు వైసీపీ నేతలు. ఓటర్లు ఇళ్లకు వెళ్లి మధ్యాహ్నం మరలా వచ్చి క్యూలైన్లలో నిలబడ్డారని..అందుకే పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు కుట్రలు, కుతంత్రాలతోనే శాంతిభద్రతలు అదుపుతప్పాయని స్పష్టంచేశారు. హరిప్రసాద్ ఈవీఎంను దొంగిలించిన కేసులో జైలుకెళ్లాడన్న వైసీపీ నేతలు..ఏ రాజ్యాంగ సంస్థలోనికీ అతడికి ప్రవేశం ఉండదని విమర్శించారు. తెలుగు దొంగల పార్టీ (టీడీపీ)లో మాత్రమే ప్రవేశం ఉంటుందని ధ్వజమెత్తారు.

చంద్రబాబుతో రిటైర్డ్ అధికారి సత్యనారాయణ లాలూచీ పడి ఆధార్ డేటాను లీక్ చేశారని..ఈ-ప్రగతికి అందజేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు, డీజీపీ వ్యక్తులు కలిసి ఈ సంస్థలను స్థాపించారని విమర్శించారు. అధికారిక డేటాను ఆయా సంస్థలకు మళ్లించారని ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. ఈ-ప్రగతి పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును జైలుకు పంపేందుకు ఈ ఒక్క కేసు చాలన్నారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని త్వరలోనే బయపడతాయని స్పష్టంచేశారు వైసీపీ నేతలు.
First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...