news18-telugu
Updated: May 20, 2019, 2:17 PM IST
విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)
ఏపీ సీఎం చంద్రబాబును ఢిల్లీలో అందరూ ఫెవికాల్ బాబా అని పిలుస్తున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన 2019, మే 20వ తేదీ సోమవారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. చంద్రబాబు బీజేపీయేతర పార్టీలను కలుస్తుండడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట’ అని ట్విట్టర్లో తెలిపారు.
అంతేకాకుండా, ‘ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయా, అఖిలేశ్, రాహుల్, పవార్లను ఫోటో సెషన్ల కోసం హింస పెడుతున్నాడట. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు పెడుతున్నారు.
First published:
May 20, 2019, 2:17 PM IST