గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్..ఏపీలో శాంతిభద్రతలపై ఫిర్యాదు

ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇదంతా చేస్తున్నారని..చంద్రబాబు వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని జగన్ ఫిర్యాదుచేయనున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: April 16, 2019, 6:28 AM IST
గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్..ఏపీలో శాంతిభద్రతలపై ఫిర్యాదు
వైఎస్ జగన్
news18-telugu
Updated: April 16, 2019, 6:28 AM IST
పోలింగ్ ముగిసిన తర్వాత ఎక్కడైనా రాజకీయంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీలు ఎన్నికల సంఘం వద్ద పోటాపోటీగా ఫిర్యాదులు చేశాయి. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం పనితీరుపై టీడీపీ ఫిర్యాదుచేయగా..ఏపీలో టీడీపీ హింసకు పాల్పడిందని వైసీపీ కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఇవాళ గవర్నర్‌ను కలవబోతున్నారు.

ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘటనలపై ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు జగన్. శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ఏపీ సీఎం ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపిలో పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ఏర్పాటు, ఈసీ పనితీరు, ఈవీఎంలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇదంతా చేస్తున్నారని..చంద్రబాబు వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని జగన్ ఫిర్యాదుచేయనున్నట్లు సమాచారం. పార్టీ సీనియర్లు సైతం జగన్ వెంట వెళ్లనున్నారు.


First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...