Home /News /politics /

#AmaravatiReport: రాజధానిలో రెపరెపలాడే జెండా ఏది?

#AmaravatiReport: రాజధానిలో రెపరెపలాడే జెండా ఏది?

అమరావతి ప్రతీకాత్మక చిత్రం

అమరావతి ప్రతీకాత్మక చిత్రం

తాడికొండ, పెదకూరపాడులో గతంలో కంటే ఈ సారి వైసీసీ అభ్యర్ధులు బలమైన వారు అవ్వడం వైసీపీకి కలిసొచ్చే అంశం.

  (రఘు అన్నా, గుంటూరు రిపోర్టర్, న్యూస్‌18)

  గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడుతో పాటుగా సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన రాజధాని ప్రాంతం 2014 లో మెజార్టీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది. అయితే ప్రస్తుతం మారిన పరిణామాల నేపథ్యంలో తెలుగు దేశం గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి. తాడికొండ, పెదకూరపాడులో గతంలో కంటే ఈ సారి వైసీసీ అభ్యర్ధులు బలమైన వారు అవ్వడం, పైగా స్థానికులు కూడా అవ్వడం జగన్ మోహన్ రెడ్డి పార్టీకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి.

  Loksabha Election 2019, Telangana Loksabha Election 2019, Andhra Pradesh assembly Election 2019, Lost Voter ID card, duplicate voter id card, duplicate voter id card download, duplicate voter id card application form, డూప్లికేట్ ఓటర్ ఐడీ కార్డ్, ఎలక్షన్ 2019, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు 2019, లోక్‌సభ ఎన్నికలు 2019, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
  ప్రతీకాత్మక చిత్రం


  రైతులు స్వచ్ఛందంగా వేల ఎకరాలు రాజధాని కోసం భూములు ఇచ్చారని ప్రభుత్వం చెబుతున్నా... రాజధాని భూముల విషయంలో బలవంతంగా రైతుల వద్ద నుంచి భూములను లాక్కున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా ఇక్కడ అధికారపార్టీ కి చెందిన సామాజికవర్గానికి లబ్దిని చేకుర్చేందుకే ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

  New andhra pradesh capital Amaravati నవ్యాంధ్ర రాజధాని అమరావతి
  అమరావతి డిజైన్లు


  మంగళగిరిలో మొదటి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్టు కేటాయిస్తామంటూ చివరి నిమిషంలో నారా లోకేష్‌కు టికెట్ కేటాయించటంతో అక్కడ అసమ్మతి కనిపిస్తోంది.

  Lokesh comments on KCR create boomerang to him on social media | ఏపీ మంత్రి, టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ తన వ్యాఖ్యలతో పదేపదే ప్రత్యర్థుల చేతికి చిక్కుతున్నారు. ఇటీవల వైఎస్ వివేకా హత్యపై ఆయన చేసిన కామెంట్స్.. ఎన్నికల తేదీని తప్పుగా ప్రస్తావించడం.. సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోల్స్‌కు దారితీసింది. తాజాగా మరోసారి ఆయన నోరు జారారు. కేసీఆర్ ఆంధ్రాపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించబోయి.. అర్థం లేని ఆరోపణలు చేశారు. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకుపోవడానికి కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు.
  నారా లోకేశ్(File)


  సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు టికెట్ ఇవ్వొద్దంటూ కొందరు భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు, కుమార్తె జోక్యం ఎక్కువైపోయిందనే అభిప్రాయం ఉంది. ఇటు వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు పరిస్థితి కూడా దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్న చందంగానే ఉండడం గమనార్హం. ఆయన నోటి దురుసుతనం వల్ల చాలా వరకు క్యాడర్ దూరమయ్యారనే అభిప్రాయం ఉంది. పైగా జనసేన తరఫున పోటీ చేస్తున్న యర్రం వెంకటేశ్వరరెడ్డి ప్రభావం మిగిలిన ఇద్దరు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

  kodela siva prasad rao
  కోడెల శివప్రసాద రావు (ఫేస్‌బుక్ ఫోటో)


  మరో రెండు వారాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజధానిలో ఏపార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకొంటుందో చూడాలి.
  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Guntur S01p13, Tdp, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు