టీడీపీకి 140 సీట్లు పక్కా...ఏపీలో వార్ వన్ సైడ్ అంటున్న మాగంటి

ఏలూరు ఎంపీ మాగంటి బాబు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో పింఛన్‌దారులు, మహిళలు టీడీపీకే మద్దతిచ్చారని.. తమకు 140 సీట్లు రావడం ఖాయమన్నారు.

news18-telugu
Updated: April 20, 2019, 2:08 PM IST
టీడీపీకి 140 సీట్లు పక్కా...ఏపీలో వార్ వన్ సైడ్ అంటున్న మాగంటి
తెలుగుదేశం పార్టీ లోగో
news18-telugu
Updated: April 20, 2019, 2:08 PM IST
ఏపీలో ఎన్నికలు ముగిసి పది రోజులవుతోంది. గెలుపుపై టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాబోయే సీఎం జగనేనని వైసీపీ నేతలు ఇప్పటికే ప్రిపేరవగా...మరోసారి అధికారం తమదేనని టీడీపీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు సైతం ఎవరికి వారే గెలుపు అంచనాల్లో ఉన్నారు. తాజాగా ఆ పార్టీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో పింఛన్‌దారులు, మహిళలు టీడీపీకే మద్దతిచ్చారని.. తమకు 140 సీట్లు రావడం ఖాయమన్నారు మాగంటి.

టీడీపీకి కనీసం 101 సీట్లు రావడం గ్యారంటీ. మహిళలలు, పింఛన్ దారులు ఓట్లతో 140 సీట్లు సాధించి ఎన్నికల వార్ వన్ సైడ్ అని నిరూపిస్తాం. జగన్ ముందే నేమ్ ప్లేట్ తయారు చేయించి కుర్చీ ఎక్కడానికి కంగారు పడుతున్నారు. సీఎం కుర్చీ మామూలు కుర్చీయా? అదేమైనా మ్యూజికల్ ఛైరా?
మాగంటి బాబు, ఏలూరు ఎంపీ


ap elections 2019, andhra pradesh elections, ys jagan, chandrababu naidu, tdp, ysrcp, ap election survey, mp maganti babu, lok sabha elections 2019, ఏపీ ఎన్నికలు, మాగంటి బాబు, చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్, లోక్‌సభ ఎన్నికలు, టీడీపీ, వైసీపీ
మాగంటి బాబు


ఏపీలో ఏప్రిల్ 11న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 25 పార్లమెంటరీ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏపీ అసెంబ్లీకి మొత్తం 2,118 మంది పోటీ చేయగా.. లోక్‌సభకు 319 మంది పోటీపడ్డారు. విజయం తమదేనని ఇటు టీడీపీ, అటు వైసీపీ ఢంకా బజాయిస్తున్నాయి. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. అధికారం ఎవరిని వరిస్తుందన్నది మే 23న తేలనుంది.
First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...