ఏపీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న టీడీపీ

కొత్త ప్రభుత్వం వచ్చిన మూడు, నాలుగు నెలల్లో ఈ ఎన్నికల ప్రహసనం మొత్తం పూర్తి చేసేస్తే ఆ తర్వాత నాలుగున్నరేళ్ల పాటు పాలన మీద దృష్టిపెట్టొచ్చు.

news18-telugu
Updated: April 23, 2019, 10:56 AM IST
ఏపీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ లోగో
news18-telugu
Updated: April 23, 2019, 10:56 AM IST
ఎన్నికలు ముగిశాయి. దాదాపు రెండు నెలల పాటు ఓటర్లు వివిధ పార్టీల ప్రచార హోరు వినీ వినీ.. తమ తీర్పు కూడా ఇచ్చేశారు. అయితే, మరోసారి ప్రజల వద్దకు నేతలు అంటూ కొత్త ట్రెండ్ మొదలు పెడుతోంది తెలుగుదేశం పార్టీ. ఎన్నికల్లో ఓటు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలపడానికి అభ్యర్థులు, నేతలు ఊరూరా తిరగనున్నారు. ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు అందరితోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. ఆ చర్చల్లో నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి ఓటరు దేవుల్లకు కృతజ్ఞతలు చెప్పాలని ఆదేశించారు. అయితే, ఎవరు ఓటు వేశారు? ఎవరికి ఓటు వేశారనేది ఎవరికీ తెలియదు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఓటరు దేవుళ్లు ఎవరిని అందలం ఎక్కించారనే విషయం మాత్రం తెలీదు. కానీ, ముందుగానే టీడీపీ నేతలు ఇలా ప్రజల వద్దకు వెళ్లడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది.

ఎన్నికల్లో గెలుపు మీద టీడీపీ ధీమాగా ఉంది. ఆ పార్టీ నేతలు తమకు 130 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వైసీపీ కూడా తమకు 120కి తగ్గకుండా సీట్లు వస్తాయని చెబుతున్నారు. జనసేన మాత్రం తమకు సీట్లు ముఖ్యం కాదని, మార్పు ముఖ్యమని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం అయినా రావొచ్చు. అయితే, కథ అంతటితో ముగిసిపోలేదు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ వెంటనే మరోసారి గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన మూడు, నాలుగు నెలల్లో ఈ ఎన్నికల ప్రహసనం మొత్తం పూర్తి చేసేస్తే ఆ తర్వాత నాలుగున్నరేళ్ల పాటు పాలన మీద దృష్టిపెట్టొచ్చు. ఈ క్రమంలో ఒకవేళ టీడీపీ గెలిస్తే ఓకే. ఓడిపోయినా కేడర్‌లో ధైర్యం సడలకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు ఈ కొత్త ట్రెండ్‌ను మొదలు పెట్టి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...