ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు?...ప్రొ. కే.నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు

AP Elections 2019: Prof K Nageshwar Analysis | ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా ఉందన్న ప్రొఫసర్ కె.నాగేశ్వర్...పాదయాత్ర తర్వాత జగన్ పెరుగుతున్నాడన్నది తన అంచనాగా చెప్పారు. అయితే ఎన్నికల్లో స్వీప్ చేసే స్థాయిలో జగన్ పెరుగుతున్నాడా? అన్నది వేచి చూడాల్సి ఉందన్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 8:41 PM IST
ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు?...ప్రొ. కే.నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ (File)
  • Share this:
ఏపీలో జరగనున్న జమిలి ఎన్నికల్లో ఎవరిది విజయం? నిజంగానే వైసీపీ ప్రభంజనం సృష్టించబోతుందా? టైమ్స్ నౌ సర్వే అంచనాలు నిజమవుతాయా? అనే అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫసర్ కే.నాగేశ్వర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ 22 స్థానాల్లో గెలుచుకుంటుందని, టీడీపీ కేవలం మూడు స్థానాలకు పరిమితమవుతుందని టైమ్స్ నౌ సర్వే అంచనావేయడం తెలిసిందే. ఈ సర్వే ఫలితాల స్పందించిన ప్రొఫసర్ కే.నాగేశ్వర్...సర్వేలను పరిగణలోకి తీసుకుని ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయో? ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏడు సీట్లు దక్కుతాయ టైమ్స్ నౌ సర్వే అంచనా వేయగా కేవలం 1 స్థానానికి పరిమితమయ్యిందని గుర్తుచేశారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ రెండు స్థానాల్లో గెలుస్తుందని టైమ్స్ నౌ అంచవేస్తోందని అన్నారు.

ఒక రకమైన వేవ్ ఉన్నప్పుడు మాత్రమే సర్వేలు ఖచ్చితమైన ప్రజాభిప్రాయాన్ని అంచనావేయగలుగుతాయని ప్రొఫసర్ కె.నాగేశ్వర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఖచ్చితంగా పైచేయి సాధిస్తుందని, దీనికి ఎలాంటి సర్వేలు చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి సర్వే మినహా...మిగిలిన అన్ని సర్వేలు టీఆర్ఎస్సే పైచేయి సాధిస్తుందని అంచనా వేయగలిగాయన్నారు.


ఏపీకి సంబంధించినంత వరకు ఎక్కువ సర్వేలు వైసీపీ వైపే మొగ్గుతున్నాయని అన్నారు. అయితే ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంటుందని అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో టీడీపీ సర్కారు ఇటీవల ప్రారంభించిన సంక్షేమ పథకాలు, రాజకీయ వలసలు, జనసేన పార్టీ ప్రమేయం, జనసేన-బీఎస్పీ కూటమి కారణంగా దళిత ఓటర్లు, కాపు ఓటర్లపై ప్రభావం, ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీ-వైసీపీ ప్రచార వ్యూహాలు తదితర అంశాలు ఏ మేరకు ఉంటుంటో వేచి చూడాల్సి ఉందన్నారు. అయితే పాదయాత్ర తర్వాత వైఎస్ జగన్ పెరుగుతున్నాడన్నది తన అంచనాగా చెప్పారు. అయితే ఎన్నికల్లో స్వీప్ చేసే స్థాయిలో జగన్ పెరుగుతున్నాడా? అన్నది వేచి చూడాల్సి ఉందని ప్రొఫసర్ కె.నాగేశ్వర్ పేర్కొన్నారు.
First published: March 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు