లగడపాటికి షాక్ ఇచ్చిన కేసీఆర్.. జగన్ విషయంలో అదే కరెక్టా?

AP Elections 2019: ఏపీలో తాను సర్వే నిర్వహించానని, దాన్ని బట్టి వైఎస్‌ఆర్‌సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించారు.

news18-telugu
Updated: May 19, 2019, 3:31 PM IST
లగడపాటికి షాక్ ఇచ్చిన కేసీఆర్.. జగన్ విషయంలో అదే కరెక్టా?
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్(File)
  • Share this:
మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు.. అందరి దృష్టి ఏపీ పైనే. అక్కడ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందోనని ఉత్కంఠ. అయితే, ఫలితాలు వెలువడేకంటే ముందే ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఎవరికి తోచినట్లు వారు ఫలితాలను వెల్లడిస్తారు. వ్యక్తిగతంగా కూడా కొందరు ఓటర్ల నాడీని విశ్లేషిస్తారు. వారిలో లగడపాటి రాజగోపాల్ ఒకరు. ప్రతి ఎన్నికల్లో ఆయన తన టీంతో సర్వేలు చేయిస్తారు. దాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తారు. ఒకప్పుడు లగడపాటి సర్వేలు అంటే కచ్చితంగా ఉంటాయని అంటుండే వారు. ఆయన చెప్పినదాని బట్టి బెట్టింగులు కూడా జరుగుతుండేవి. కానీ, తాజాగా చాలా సందర్భాల్లో ఆయన లెక్క తప్పింది. తమిళనాడు, కర్ణాటక ఎన్నికల్లో ఆయన చెప్పిన రిజల్ట్ రాలేదు. గత డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘోరంగా ఓడిపోతుందని చెప్పారు. కానీ, ఆయనకు షాక్ ఇస్తూ కేసీఆర్ పార్టీ భారీ సీట్లను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వే నిర్వహించి 90 సీట్లు వస్తాయని చెప్పారు. అనుకున్నట్లు గానే ఆ పార్టీ 88 సీట్లు గెలుచుకుంది. అదే ఊపులో ఈ సారి ఏపీలోనూ సర్వే నిర్వహించి వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందని ప్రకటించారు. గత నెలలో వికారాబాద్ జిల్లా చేవెళ్లలో మాట్లాడుతూ తాను ఓ సర్వే చేయించానని, దాని ప్రకారం ఏపీలో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు.

అంటే, కేసీఆర్ సర్వే నిజం అవుతుందా? అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్.. అనుకున్నట్లుగానే సర్వే విషయాలు బయటపెట్టారు. జగన్‌ పార్టీ అధికారం చేపడుతుందని, టీడీపీకి డిపాజిట్లు కూడా రావని కేసీఆర్ గతంతో వ్యాఖ్యానించారు. దాన్ని బట్టి కేసీఆర్ సర్వే ఫలితాలు నిజమవుతాయా? అన్నది 23వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. అయితే 2014 ఎన్నికల్లోనూ కేసీఆర్ సర్వే నిర్వహించారు. అప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తాయని చెప్పారు. కానీ, ఏపీలో టీడీపీ అధికారం దక్కించుకుంది. మరి ఈ సారి ఎన్నికల్లో ఏమవుతుందో? చూడాలి.
First published: May 19, 2019, 3:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading