ఏపీలో వీవీప్యాట్ స్లిప్పుల కలకలం..స్కూలు బయట కట్టలు కట్టలు

కలెక్టర్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆర్డీవో స్కూల్ ప్రాంగణానికి వచ్చి పరిశీలించారు. పలు కవర్లలో వారికి వీవీపాట్ స్లిప్పులు కనిపించాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ అధికారుల వివరణ కోరారు.

news18-telugu
Updated: April 15, 2019, 4:52 PM IST
ఏపీలో వీవీప్యాట్ స్లిప్పుల కలకలం..స్కూలు బయట కట్టలు కట్టలు
వీవీపాట్ యంత్రం
news18-telugu
Updated: April 15, 2019, 4:52 PM IST
ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే దేశరాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని విపక్షాలు ఈవీఎంల విశ్వసనీయతపై ఎన్నో అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తీవ్ర కలకలం రేగింది. స్ట్రాంగ్ రూమ్స్‌లో ఉండాల్సిన వీవీపాట్ స్లిప్పులు ఆరుబయట కనిపించడం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ పాఠశాల బయట కుప్పలుకుప్పులగా స్లిప్పులు కనిపించండంతో ఓ విద్యార్థి మీడియాకు సమాచారం అందించారు. ఐతే ఆ స్లిప్పులు ర్యాండమైజేషన్ చేసిన స్లిప్పులు కావొచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

ర్యాండమైజేషన్ స్లిప్పులయినప్పటికీ వాటిని భద్రపరచాల్సి ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో స్లిప్పులు పట్టుబడ్డాయి. కలెక్టర్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆర్డీవో స్కూల్ ప్రాంగణానికి వచ్చి పరిశీలించారు. పలు కవర్లలో వారికి వీవీపాట్ స్లిప్పులు కనిపించాయి. వాటిపై సీరియల్ నెంబర్, సెషన్, అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ అధికారుల వివరణ కోరారు. కాగా, ఇప్పటికే ఈవీఎంల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నారు. 50శాతం వీవీపాట్ స్లిప్పులను లెక్కబెట్టాలని..లేదంటే పాతపద్దతిలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల సంఘం ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న క్రమంలో ఇప్పుడు ఏకంగా వీవీపాట్ స్లిప్పులు బయటపడడం దుమారం రేపుతోంది.

First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...